బొప్పాయి ముక్కలను వాటర్ లో మరిగించి తాగితే ఇన్ని ప్రయోజనాలు లభిస్తాయా?

ఈ ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన పండ్ల‌లో బొప్పాయి ఒకటి.బొప్పాయి పండు మధురమైన రుచితో పాటు విటమిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ డి, పొటాషియం, ఐర‌న్‌, కాల్షియం, మెగ్నీషియం, ఫైబ‌ర్‌, ప్రోటీన్ తో స‌హా ఎన్నో అమోఘ‌మైన పోషకాలను కలిగి ఉంటుంది.

అందుకే చాలా మంది బొప్పాయి పండును తమ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు.

అయితే బొప్పాయి పండును నేరుగానే కాదు వాటర్ లో మరిగించి తీసుకున్నా బోలెడ‌న్ని ప్రయోజనాలను పొందచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అందుకోసం కాస్త దోర‌గా పండిన ఒక బొప్పాయి పండును తీసుకుని పై తొక్క, లోపల ఉండే గింజలను తొలగించి వాట‌ర్ లో శుభ్రంగా క‌డ‌గాలి.

ఇలా క‌డిగిన బొప్పాయి పండును చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే అందులో క‌ట్ చేసి పెట్టుకున్న బొప్పాయి పండు ముక్కలు వేసి ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించాలి.

అనంతరం స్ట‌వ్ ఆఫ్ చేసి స్ట్రైన‌ర్ స‌హాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.

ఈ వాట‌ర్ పూర్తిగా చల్లారిన తర్వాత నేరుగా సేవించాలి. """/"/ ఈ వాటర్ ను ప్రతి రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

స్త్రీలలో నెలసరి సమస్యలు ఏమైనా ఉంటే దూరం అవుతాయి.వెయిట్ లాస్ అవుతారు.

శరీరంలో పెరుగుపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి.మూత్రపిండాలు, లివర్ శుభ్రంగా మారతాయి.

కీళ్ల నొప్పులు ఉంటే దూరం అవుతాయి.రక్తపోటు అదుపులో ఉంటుంది.

మరియు రోగ నిరోధక వ్యవస్థ సైతం బలపడుతుంది.ఇన్ని ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ బొప్పాయి వాటర్ ను రెగ్యుల‌ర్ డైట్ లో చేర్చుకునేందుకు ప్రయత్నించండి.

రాజబాబు అసలు పేరేంటో మీకు తెలుసా.. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్నారా?