చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే ఉల్లి నీళ్లు.. రోజు తాగితే ఎన్ని ప్రయోజనాలో!

ఉల్లిపాయలు.ప్రతి ఒక్కరి ఇళ్లల్లోనూ నిత్యం వీటిని వాడుతుంటారు.

ఘాటైన రుచి, వాసన కలిగి ఉండే ఉల్లిపాయల్లో బోలెడన్ని పోషకాలు నిండి ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తాయి.

ముఖ్యంగా చలికాలంలో ఉల్లి నీళ్లు రోజు తాగితే ఎన్నో ఊహించని ఆరోగ్య ప్రయోజనాలను తమ సొంతం చేసుకోవచ్చు.

మరి ఇంకెందుకు ఆలస్యం ఉల్లి నీళ్లు ఎలా తయారు చేసుకోవాలి.? వాటిని తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి.

? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక మీడియం సైజు ఉల్లిపాయని తీసుకుని తొక్క తొలగించి నీటిలో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోయాలి.

వాటర్ హీట్ అవ్వగానే అందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కనీసం ప‌ది నుంచి ప‌దిహేను నిమిషాల పాటు మరిగించాలి.

"""/"/ ఆ తర్వాత స్టైనర్ సహాయంతో వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి.ఈ వాటర్ పూర్తిగా చల్లారిన తర్వాత సేవించాలి.

ఉల్లిలో సల్ఫర్‌ అధికంగా ఉంటుంది.ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించడంలో సహాయపడుతుంది.

ఫలితంగా జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.మళ్ళీ మళ్ళీ రాకుండా సైతం ఉంటాయి.

అలాగే ఉల్లి నీళ్లు తీసుకోవడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా అడ్డుకుంటాయి.

Emశ్వాసకోశ సమస్యలను దూరం చేయడంలో ఉల్లి నీళ్లు గ్రేట్ గా హెల్ప్ చేస్తాయి.

రోజు ఉల్లి నీళ్లు తీసుకుంటే ఊపిరితిత్తుల్లో వాపు గుణాన్ని తగ్గించి, శ్వాస మెరుగ్గా ఆడేలా చేస్తుంది.

ఉల్లి నీళ్లు తాగడం వల్ల స్టమక్ అల్సర్ దూరమవుతుంది.జీర్ణవ్యవస్థ చురుగ్గా మారుతుంది.

రోగ‌ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.గుండె జబ్బులు వచ్చే రిస్క్ సైతం తగ్గుతుంది.

థమన్ ఆవేదన గురించి రియాక్ట్ అయిన చిరంజీవి.. అలా కామెంట్లు చేశారా?