వింటర్ లో మీరు కచ్చితంగా ట్రై చేయాల్సిన హెల్తీ సూప్ ఇది.. వారానికి ఒకసారి తీసుకున్న బోలెడు లాభాలు!

ప్రస్తుత వింటర్ సీజన్( Winter Season ) లో ఎలాంటి రోగాల బారిన పడకుండా హెల్తీగా మరియు హ్యాపీగా జీవించాలంటే కచ్చితంగా డైట్ లో కొన్ని కొన్ని ఆహారాలను చేర్చుకోవాల్సి ఉంటుంది.

అందులో సూప్స్ కూడా ఉంటాయి.ముఖ్యంగా మష్రూమ్ సూప్ చల్లటి వాతావరణానికి సరైన వంటకం అనడంలో సందేహం లేదు.

వింట‌ర్‌ లో ప్రతి ఒక్కరూ కచ్చితంగా ట్రై చేయాల్సిన ఆరోగ్యకరమైన సూప్ ఇది.

మష్రూమ్ సూప్ ను వారానికి ఒకసారి తీసుకున్న బోలెడు లాభాలు పొందవచ్చు. """/"/ ఒకప్పుడు వర్షాకాలంలో మాత్రమే మష్రూమ్స్( Mushrooms ) దొరికేవి.

కానీ ఇప్పటి రోజుల్లో సీజన్ తో పని లేకుండా ఏడాది పొడవునా మార్కెట్లో మష్రూమ్స్ అందుబాటులో ఉంటున్నాయి.

ఎన్నో రకాల విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్లు, ఫైబర్ మష్రూమ్స్ ద్వారా పొందవచ్చు.ఇటువంటి మష్రూమ్స్ తో సూప్ ను తయారు చేసుకుని చలికాలంలో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

మష్రూమ్ సూప్( Mushroom Soup ) మిమ్మల్ని లోపల నుంచి వెచ్చగా మారుస్తుంది.

చలిని తట్టుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది.వింటర్ సీజన్లో సహజంగానే సూర్యుడు పెద్దగా ఉండదు.

అందువల్ల చాలా మంది విటమిన్ డి లోపానికి గురవుతుంటారు.అయితే విటమిన్ డి ఉండే అతికొద్ది ఆహారాల్లో మష్రూమ్స్ ఒకటి.

అలాంటి వాటితో సూప్ ను తయారు చేసుకుని తీసుకుంటే విటమిన్ డి కొరత తలెత్తకుండా ఉంటుంది.

"""/"/ వెయిట్ లాస్ ( Weight Loss )అవ్వాలనుకునే వారికి మష్రూమ్‌ సూప్ గొప్ప ఎంపిక.

ఈ సూప్ లో కొవ్వులు, కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి.అందువల్ల సాయంత్రం వేళ ఈ సూప్ ను తీసుకుంటే కడుపు నిండుగా ఉంటుంది.

మెటబాలిజం రేటు పెరిగి వేగంగా బరువు తగ్గుతారు.అంతేకాకుండా మష్రూమ్ సూప్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తి( Immunity )ని పెంచేందుకు హెల్ప్ చేస్తాయి.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలను నయం చేస్తాయి.

మరియు ఈ సూప్ వల్ల గట్ హెల్త్ మెరుగుపడుతుంది.మలబద్ధకం సమస్య ఉన్న కూడా దూరం అవుతుంది.

తండ్రి కష్టాలు చూసి ఆరు మెడల్స్ సాధించిన కూతురు.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!