పెసలతో ఆ సమస్యలన్నీ హాంఫట్.. మరి వారానికి ఒక్కసారైనా వాటిని తింటున్నారా?

పెసలు( Mung Bean ).వీటి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు.

మన దేశంలో పూర్వకాలం నుంచి పెసలను వాడుతున్నారు.ఆరోగ్యపరంగా పెసలు మనకు అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, మ్యాంగనీస్, కాపర్, విటమిన్ బి, ప్రోటీన్, ఫైబర్ వంటి ఎన్నో పోషకాలను పెసలు ద్వారా పొందవచ్చు.

పెసలను డైట్ లో చేర్చుకుంటే ఎన్నో సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు.పెసలను ఉడికించి తీసుకోవచ్చు.

పెసరట్టు, మొలకెత్తిన పెసలు.ఇలా ఎలా అయినా తినవచ్చు.

వెయిట్ లాస్( Weight Loss ) అవ్వాలనుకునే వారికి పెసలు బెస్ట్ ఫుడ్ గా చెప్పుకోవచ్చు.

పెసలను ఆహారంలో బాగా చేసుకోవడం వల్ల ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావన కలుగుతుంది.

అతి ఆకలి దూరం అవుతుంది.అదే సమయంలో మెటబాలిజం రేటు ఇంప్రూవ్ అవుతుంది.

దాంతో అధిక క్యాల‌రీలు త్వ‌ర‌గా క‌రిగి వేగంగా వెయిట్ లాస్ అవుతారు. """/" / ప్రోటీన్ కొరతతో బాధపడేవారు నిత్యం మొలకెత్తిన పెసలను తీసుకుంటే చాలా మంచిది.

మొలకెత్తిన పెసలతో ప్రోటీన్ కొరత హాంఫట్ అవుతుంది.డైటరీ ఫైబర్ ( Fiber )అధికంగా ఉండటం వల్ల పెసలను తీసుకుంటే గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

అలాగే పెసలను వారానికి కనీసం ఒకటి లేదా రెండు సార్లు తిన్నా కూడా రక్తహీనత బారిన పడకుండా ఉంటారు.

ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది.రక్తపోటు అదుపులో ఉంటుంది.

"""/" / చాలా మంది హెయిర్ ఫాల్‌ సమస్యతో( Hairfall Problem ) సతమతం అయిపోతుంటారు.

అలాంటివారు కచ్చితంగా పెసలు తీసుకోండి.పెసలు లో ఉండే పుష్కలమైనటువంటి ప్రోటీన్లు మరియు న్యూట్రీషియన్స్ హెయిర్ ఫాల్ కు అడ్డుకట్ట వేస్తాయి.

జుట్టు ఒత్తుగా పొడవుగా పెరిగేందుకు తోడ్పడతాయి.పైగా వయసును దాచేసి సామర్థ్యం పెసలకు ఉంది.

ముఖ్యంగా ముడి పెసలు తీసుకోవడం వల్ల సూపర్ హెల్తీ గా ఫిట్ గా ఉంటారు.

అదే టైంలో యంగ్ గా కూడా కనిపిస్తారు.

బొప్పాయి ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టును పెంచుతుంది.. ఎలాగంటే?