మున‌గాకుతో స్మూతీ.. వారంలో 3 సార్లు తీసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

మున‌గాకు.దీని గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే అవుతుంది.

మున‌గాకుతో మ‌న భార‌తీయులు ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేస్తుంటారు.మున‌గాకుతో ఏ వంట‌కం చేసినా రుచిక‌రంగానే ఉంటుంది.

పైగా మున‌గాకులో ఐరన్, కాల్షియం, పొటాషియం, విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, ఫైబ‌ర్‌, ప్రోటీన్ తో స‌హా శ‌క్తి వంత‌మైన యాంటీ ఆక్సిడెంట్స్ ఎన్నో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్య ప‌రంగా మున‌గాకు అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అయితే కొంద‌రు మున‌గాకును తీసుకునేందుకు ఇష్ట‌ప‌డ‌రు.

అలాంటి వారు మున‌గాకుతో స్మూతీ త‌యారు చేసుకుని తీసుకుంటే.రుచితో పాటు మస్తు హెల్త్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం మున‌గాకుతో స్మూతీని ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు మున‌గాకు స్మూతీ ఆరోగ్యానికి ఎలాంటి ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా గుప్పెడు మున‌గాకును తీసుకుని నీటిలో శుభ్రంగా క‌డిగి ప‌క్క‌న పెట్టుకోవాలి.

అలాగే ఒక యాపిల్ ను తీసుకుని చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసుకోవాలి.

ఇప్పుడు బ్లెండ‌ర్ తీసుకుని అందులో క‌డిగి పెట్టుకున్న మున‌గాకు, క‌ట్ చేసుకున్న యాపిల్ ముక్క‌లు, ఒక‌టిన్న‌ర‌ గ్లాస్ కొబ్బ‌రి పాలు, చిన్న అల్లం ముక్క‌, నాలుగు గింజ తొల‌గించిన ఖ‌ర్జూరాలు వేసుకుని మెత్త‌గా బ్లెండ్ చేసుకుంటే.

మున‌గాకు స్మూతీ సిద్ధం అయిన‌ట్టే.సూప‌ర్ టేస్టీగా ఉండే ఈ మున‌గాకు స్మూతీని వారంలో మూడు సార్లు తీసుకుంటే చాలా మంచిది.

"""/"/ ముఖ్యంగా వెయిట్ లాస్ అవ్వాల‌ని భావించే వారు ఈ స్మూతీని డైట్ లో చేర్చుకుంటే.

వేగంగా బ‌రువు త‌గ్గుతారు.అలాగే ఈ మున‌గాకు స్మూతీ తీసుకుంటే.

బ్లెడ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులో ఉంటాయి.గుండె జ‌బ్బులకు దూరంగా ఉండొచ్చు.

ఉద‌ర సంబంధిత స‌మ‌స్య‌లు ఏమైనా ఉంటే త‌గ్గుముఖం ప‌డ‌తాయి.రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది.

మ‌రియు హెయిర్ ఫాల్ స‌మ‌స్య నుంచి సైతం విముక్తి ల‌భిస్తుంది.

జూనియర్ ఎన్టీఆర్ లుక్ బాగుందా? బాలేదా? జెన్యూన్ ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే!