ఈ సూప్ బ‌రువును త‌గ్గించ‌డ‌మే కాదు గుండె జ‌బ్బుల‌కూ చెక్ పెడుతుంది!

ఉల‌వ‌లు.నవధాన్యాల్లో ఇవీ ఒక‌టి.

ఒకప్పుడు ఎడ్లకు, గుర్రాలకు ఉల‌వ‌ల‌ను మేత‌గా వేసేవారు.ఆ త‌ర్వాత క్ర‌మంగా మ‌నుషులు కూడా వాటిని తీసుకోవ‌డం మొద‌లు పెట్టారు.

ప్ర‌స్తుత రోజుల్లో ఉల‌వ‌ల‌కు ఎక్క‌డ్లేని ప్రాధాన్య‌త ఏర్ప‌డింది.ఉల‌వ‌ల‌తో ఎన్నో ర‌కాల వంట‌ల‌ను త‌యారు చేసుకుని తీసుకుంటున్నారు.

ఉలవ‌ల్లో ఎన్నో అమోఘ‌మైన పోష‌కాలు నిండి ఉంటాయి.అందుకే అవి మ‌న ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంటాయి.

ముఖ్యంగా ఉల‌వ‌ల‌తో సూప్ ను త‌యారు చేసుకుని తీసుకుంటే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్‌ను త‌మ సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి లేటెందుకు ఉల‌వ‌ల సూప్‌ను ఎలా త‌యారు చేసుకోవాలి.? అస‌లు ఆ సూప్‌ను తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ.

? వంటి విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అర స్పూన్ ఆయిల్‌ను వేయాలి.

అందులో హాఫ్ టేబుల్ స్పూన్ వాము, వ‌న్ టేబుల్ స్పూన్ అల్లం త‌రుగు వేసి వేయించుకోవాలి.

ఇవి వేగిన త‌ర్వాత ఒక క‌ప్పు ఉడికించిన ఉల‌వ‌లు వేసుకుని మూడు నిమిషాల పాటు మూత పెట్టి మ‌గ్గ‌నివ్వాలి.

ఆ త‌ర్వాత అందులో ఉల‌వ‌ల‌ను ఉడికించిన నీటిని పోయాలి.అలాగే అర గ్లాస్ నార్మ‌ల్ వాట‌ర్‌, అర స్పూన్ జీల‌క‌ర్ర పొడి, పావు స్పూన్ మిరియాల పొడి, రుచికి స‌రిప‌డా ఉప్పు వేసుకుని బాగా క‌లిపి ప‌ది నుండి ప‌దిహేను నిమిషాల పాటు చిన్న మంట‌పై మ‌రిగించాలి.

చివ‌ర్లో వ‌న్ టేబుల్ స్పూన్ త‌రిగిన కొత్తిమీర‌ను చేరిస్తే ఉల‌వ‌ల సూప్ సిద్ధ‌మైన‌ట్లే.

"""/" / ఈ సూప్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ప్ర‌స్తుత వ‌ర్షాకాలంలో ఈ సూప్‌ను త‌ర‌చూ తీసుకుంటే బ‌రువు త‌గ్గుతారు.

గుండె జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.జ‌లుబు, ద‌గ్గు, గొంతు నొప్పి వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.

ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయి.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

మ‌రియు మూత్ర పిండాలు, మూత్రాశ‌యంలో ఏర్ప‌డే రాళ్లు సైతం క‌రిగిపోతాయి.

నారా భువనేశ్వరి పై డిప్యూటీ సీఎం కొట్టు ఫైర్