పాల‌తో అత్తి పండ్లు క‌లిపి తీసుకుంటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

పాలు, అత్తి పండ్లు(అంజీర్) రెండూ విడి విడిగా ఆరోగ్యానికి మేలు చేస్తాయ‌ని అంద‌రికీ తెలుసు.

కానీ, ఈ రెండిటినీ క‌లిపి తీసుకుంటే ఏం అవుతుంది.? అస‌లు ఎప్పుడైనా వీటిని క‌లిపి తీసుకున్నారా.

? ఇప్పుడు చెప్ప‌బోయే విష‌యాలు తెలుసుకుంటే త‌ప్ప‌కుండా తీసుకుంటారు.అవును, పాల‌తో అత్తి పండ్ల‌ను క‌లిపి తీసుకుంటే బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు పాల‌తో అత్తి పండ్ల‌ను క‌లిపి ఎలా తీసుకోవాలి.? అలా తీసుకోవ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నాలు ఏంటీ అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

సాధార‌ణంగా అత్తి పండ్లు డ్రై ఫ్రూట్ రూపంలోనే ఎక్కువ‌గా దొరుకుతాయి.వీటి ధ‌ర కూడా కాస్త ఎక్కువే.

అయితే ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌లో రెండు లేదా మూడు ఎండిన అత్తి పండ్ల‌ను వేసి బ్లండ్ చేసుకోవాలి.

అనంత‌రం అందులో కావాల‌నుకుంటే కొద్దిగా తేనె క‌లిపి డైరెక్ట్‌గా సేవించాలి.ఇలా ప్ర‌తి రోజు చేస్తే శ‌రీరానికి ఫుల్ ఎన‌ర్జీ ల‌భిస్తుంది.

ఉత్సాహంగా మారుతాయి.ఒత్తిడి, నీర‌సం, అల‌స‌ట వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి.

సంతానం కావాల‌ని కోరుకునే దంప‌తులు రెగ్యుల‌ర్‌గా పాల‌తో అత్తి పండ్ల‌ను క‌లిపి తీసుకుంటే.

అందులో ఉండే పోష‌క విలువ‌లు సంతానోత్పత్తిని పెంచడానికి సహాయపడతాయి.అలాగే అంజీర్ పండ్లు, పాలు రెండిటిలోనూ కాల్ష‌యం ఉంటుంది.

అందు వ‌ల్ల‌, ఈ రెండిటినీ క‌లిపి తీసుకుంటే శ‌రీరానికి స‌రిప‌డా కాల్ష‌యం అందుతుంది.

దాంతో ఎముక‌లు, దంతాలు మ‌రియు కండ‌రాలు దృఢంగా మార‌తాయి. """/"/ అంతేకాదు, పాల‌తో అత్తి పండ్లు క‌లిపి తీసుకుంటే గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.

చ‌ర్మం య‌వ్వ‌నంగా, ఆరోగ్యంగా మారుతుంది.ర‌క్త పోటు స్థాయిలు అదుపు త‌ప్ప‌కుండా ఉంటాయి.

మ‌ల‌బ‌ద్ధ‌కం త‌గ్గుతుంది.జీర్ణ వ్య‌వ‌స్థ చురుగ్గా మారుతుంది.

మ‌రియు ఆడ‌వారికి నెల‌స‌రి నొప్పుల నుంచి ఉప‌శమ‌నం కూడా ల‌భిస్తుంది.

ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు.. అమెరికాలో భారత సంతతి విద్యార్ధిని అరెస్ట్