వారానికి ఒక‌సారి ఉప‌వాసం చేస్తే ఎన్ని బెనిఫిట్సో?

ఉప‌వాసం లేదా ఫాస్టింగ్‌.దీని గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు.

ముఖ్యంగా మ‌న భార‌త దేశంలో ఏదైన పండ‌గ వ‌చ్చిందంటే త‌మ‌‌ కుటుంబ స‌భ్యులంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని ఆడ‌వారు ఉప‌వాసం చేస్తుంటారు.

కేవ‌లం హిందువులే కాదు.అన్ని మతాల్లోనూ ఉపవాస సంప్రదాయం కనిపిస్తుంది.

అయితే ఒక‌రు ఉప‌వాసం చేస్తే ఇంట్లో ఉన్న అంద‌రికీ మంచి జ‌రుగుతుంది అన్న విష‌యం ప‌క్క‌న పెడితే.

ఫాస్టింగ్ చేసిన వారికి మాత్రం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ల‌భిస్తాయి.కేవ‌లం పండ‌గ స‌మ‌యాల్లోనే కాదు.

వారానికి ఒక‌సారి ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి ఎంతో మేలంటున్నారు నిపుణులు.మ‌రి ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభాలు ఏంటీ అన్న‌ది లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

వారానికి ఒక‌సారి ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల శ‌రీరంలో వ్యర్థాలను, విష ‌ప‌దార్థాల‌ను బ‌య‌ట‌కుపోతాయి.

ఉపవాసం వల్ల జీర్ణ వ్యవస్థకు కాస్తంత విశ్రాంతి ల‌భిస్తుంది.ఫ‌లితంగా, దాని పనితీరు మెరుగుపడుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

"""/"/ అలాగే ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి కూడా పెర‌గుతుంది.

దాంతో అనేక జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.వారానికి ఒక‌టి సారి ఉప‌వాసం చేస్తే.

శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయిన కొవ్వు త్వ‌ర‌గా క‌రిగిపోతుంది.అదే స‌మ‌యంలో ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్‌ను కూడా దూరం చేస్తుంది.

ఫ‌లితంగా అధిక బ‌రువు మ‌రియు గుండె సంబంధిత జ‌బ్బుల‌కు దూరంగా ఉండొచ్చు.అలాగే వారానికి ఒక‌సారి ఉప‌వాసం చేయ‌డం వ‌ల్ల శరీరం యొక్క ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది.

ఫ‌లితంగా, మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.ఇక అధిక ర‌క్త‌పోటును అదుపు చేయ‌డంలోనూ ఉప‌వాసం ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే లోబీపీ ఉన్న వారు ఉప‌వాసానికి దూరంగా ఉంటేనే మంచిది.అనారోగ్యంగా ఉన్నవారు, గ‌ర్భ‌వ‌తులు, ఏవైనా మందులు వాడేవారు, పాలిచ్చే త‌ల్లులు కూడా ఉప‌వాసం చేయ‌క‌పోవ‌డ‌మే మంచిది.

రెహమాన్ కు దూరంగా ఉండటానికి కారణాలివే.. సైరా భాను కామెంట్స్ వైరల్!