వంకాయా అని చీప్ గా తీసి పారేయకండి.. వారానికి 2 సార్లు తింటే అద్భుతాలు జరుగుతాయి!
TeluguStop.com
( Brinjal ) అన్ని కూరగాయలకు ఇదే రారాజు.ఆంగ్లంలో కింగ్ ఆఫ్ వెజిటేబుల్స్ అని పిలుస్తుంటారు.
కానీ చాలా మంది వంకాయ తినడానికి ఇష్టపడరు.పిల్లలే కాదు పెద్దలు కూడా వంకాయని చాలా చీప్ గా చూస్తుంటారు.
అసలు ఇంట్లో అమ్మ వంకాయ వండితే ఆ రోజు అన్నం వంక కూడా చూడరు.
ఆఫ్ కోర్స్ ఒకప్పుడు నేను అలాగే చేశాను అనుకోండి.కానీ వంకాయ చేసే అద్భుతాలు తెలిశాక ఎవ్వరైనా సరే తినకుండా ఉండలేరు.
వారానికి రెండు సార్లు వంకాయ తీసుకుంటే ఎన్నో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
"""/" /
వంకాయలో పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్ సి, ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు ఎన్నో వంకాయలో నిండి ఉంటాయి.
వంకాయని వారానికి రెండు సార్లు తీసుకుంటే రక్తంలో చెడు కొలెస్ట్రాల్( Bad Cholesterol ను సమర్థవంతంగా కరిగిస్తుంది.
గుండెకు ముప్పును తగ్గిస్తుంది.మధుమేహం బాధితులకు వంకాయ ఉత్తమ ఔషధం గా చెప్పుకోవచ్చు.
అవును మధుమేహం( Diabetes ) ఉన్నవారు వంకాయను తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ లో హెచ్చుతగ్గులు ఏర్పడకుండా ఉంటాయని ఆరోగ్యాన్ని పనులు చెబుతున్నారు.
"""/" /
అలాగే అధిక బరువు( Overweight ) నుంచి బయటపడడానికి కూడా వంకాయ అద్భుతంగా సహాయపడుతుంది.
వెయిట్ లాస్ అవ్వాలని ప్రయత్నిస్తున్న వారు నిశ్చింతగా వంకాయను డైట్ లో చేర్చుకోవచ్చు.
వంకాయలో ఉండే పలు పోషకాలు నరాల వ్యాధులను నయం చేస్తాయి.రక్తం గడ్డ కట్టకుండా అడ్డుకట్ట వేస్తాయి.
అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు ఖచ్చితంగా వంకాయలను తీసుకోండి.ఎందుకంటే వంకాయ అధిక రక్తపోటును( High Blood Pressure ) అదుపులోకి తెస్తుంది.
అంతేకాదు వంకాయను తీసుకుంటే త్వరగా ముసలివారు అవ్వకుండా ఉంటారు.అంటే వంకాయ వయసును ఆపుతుందని కాదండోయ్ .
వృద్ధాప్య లక్షణాలను త్వరగా దరిచేరకుండా అడ్డుకుంటుంది.ముడతలు, చారలు, చర్మం సాగటం వంటివి త్వరగా రాకుండా ఉంటాయి.
వయసు పైబడిన సరే యంగ్ గా కనిపిస్తారు.
విజయ్ సేతుపతి 96 సినిమాకు సీక్వెల్.. ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలుసా?