బోడకాకర కాయ.దీనినే ఆగాకర కాయ, అడవి కాకర కాయ అని కూడా పిలుస్తుంటారు.
ఈ బోడకాకర కాయలను వర్షాకాలంలో కనీసం ఒక్క సారైన తినాలని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.
ఎందుకంటే, బోడకాకర సీజనల్ కూరగాయ.కేవలం వర్షాకాలంలో మాత్రమే దొరుకుతుంది.
పైగా ఈ బోడకాకరలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, సోడియం, విటమిన్ ఎ, విటిమన్ బి, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ డి, యాంటీ ఆక్సిడెంట్స్, ప్రోటీన్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ ఇలా చాలా పోషకాలు నిండి ఉంటాయి.
అందుకే బోడకాకర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
ఆయుర్వేదంలో కూడా బోడకాకరను ఉపయోగిస్తుంటారు.ధర కాస్త ఎక్కువే అయినప్పటికీ వర్షా కాలంలో తప్పకుండా బోడకాకరను డైట్‌లో చేర్చుకుంటే.
అనేక జబ్బులకు దూరంగా ఉండొచ్చు.ముఖ్యంగా వారంలో ఒకటి లేదా రెండు సార్లు బోడకాకరను తీసుకుంటే.
ఇమ్యూనిటీ పవర్ అద్భుతంగా పెరుగుతుంది.దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్లు, వైరల్ జ్వరాలు, ప్రాణాంతకరమైన వైరస్‌లు దరి చేరకుండా ఉంటాయి.
జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు ఇలాంటి సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండొచ్చు.
అలాగే ఈ సీజన్‌లో చర్మ మరియు కేశ సంబంధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.
అయితే బోడకాకరను తీసుకుంటే.అందులో ఉండే పోషక విలువలు ముడతలను, మచ్చలను తగ్గించి చర్మాన్ని యవ్వనంగా మారుస్తాయి.