ఆరోగ్యానికి వరం తోటకూర గింజలు.. ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరు!

తోటకూర గింజలు( Amaranth Seeds ) లేదా అమరాంత్ విత్తనాలు గురించి మ‌న‌లో చాలా మందికి స‌రైన అవ‌గాహ‌న కూడా లేదు.

బియ్యం, క్వినోవా మాదిరిగానే తోట‌కూర గింజ‌ల‌ను కూడా ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల్లో ప్ర‌ధాన ఆహారంగా తీసుకుంటారు.

తొట‌కూర గింజ‌ల‌ను గ్రెయిన్ ఆఫ్ గాడ్, గ్రెయిన్ ఆఫ్ కింగ్స్ అని అంటుంటారు.

ఫైబర్, ప్రొటీన్, మాంగనీస్‌, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, జింక్, విటమిన్‌ బి6, ఫోలేట్‌ వంటి ఎన్నో పోష‌కాల‌ను క‌లిగి ఉండ‌టం కార‌ణంగా.

ఆరోగ్యానికి తోట‌కూర గింజలను వరంగా భావిస్తారు.గుండె ఆరోగ్యానికి తోట‌కూర గింజ‌లు చాలా మేలు చేస్తాయి.

వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంద‌ని ప‌లు అధ్యయనాలు తేల్చాయి.

అలాగే తోట‌కూర గింజ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు( Anti-Oxidants ) ఉంటాయి.ఇవి ణాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.

"""/" / బ‌రువు త‌గ్గాల‌ని( Weight Loss ) ప్ర‌య‌త్నిస్తున్న వారికి తోట‌కూర గింజ‌ల‌ను ప్ర‌ధాన ఆహారంగా చేసుకోవ‌డం మంచి ఎంపిక అవుతుంది.

తోట‌కూర గింజ‌ల్లో ప్రోటీన్ మ‌రియు ఫైబ‌ర్ మెండ‌గా నిండి ఉండ‌టం వ‌ల్ల‌.బ‌రువు త‌గ్గ‌డానికి ఇవి అద్భుతంగా తోడ్ప‌డ‌తాయి.

అలాగే తోట‌కూర గింజ‌ల్లో ఉండే ఫైబ‌ర్ కంటెంట్ జీర్ణ‌క్రియ ఆరోగ్యానికి మ‌ద్ద‌తు ఇస్తాయి.

మ‌ల‌బ‌ద్ధ‌కం, అతిసారం వంటి జీర్ణాశ‌య వ్యాధుల‌కు చెక్ పెడ‌తాయి. """/" / తోట‌కూర గింజ‌లు సహజంగానే గ్లూటెన్ రహితంగా ఉంటాయి.

గ్లూటెన్-ఫ్రీ డైట్‌లో ఉన్నవారు వీటిని ఆస్వాదించవచ్చు.అంతేకాకుండా తోట‌కూర గింజ‌ల‌ను ఆహారంలో భాగం చేసుకోవ‌డం వ‌ల్ల క్యాన్స‌ర్‌, మ‌ధుమేహం వంటి ప్ర‌మాద‌క‌ర‌మైన జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.

ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న వారికి కూడా తోట‌కూర గింజ‌లు ఉత్త‌మ ఆహారంగా చెప్ప‌బ‌డ్డాయి.

వీటిలో ఐర‌న్ కంటెంట్ పుష్క‌లంగా ఉంటుంది.అందువ‌ల్ల తోట‌కూర గింజ‌ల‌ను డైట్ లో చేర్చుకుంటే హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ పెరుగుతాయి.

ర‌క్త‌హీన‌త దూరం అవుతుంది.

పెళ్లి తర్వాత హ్యాపీగా లేము… ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చిన అమర్ తేజు… ఆ వార్తలను నిజం చేస్తారా?