నిద్రించే ముందు ఒక గ్లాస్ శొంఠి పాలు తాగితే ఆ జబ్బులన్నీ పరార్!
TeluguStop.com
ఆయుర్వేదంలో `శొంఠి` కి ప్రత్యేకమైన స్థానం ఉంది.ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉండే శొంఠిని సర్వరోగ నివారిణి అని కూడా పిలుస్తుంటారు.
అల్లంతో శొంఠి తయారు చేస్తారు.కానీ, అల్లం కంటే గొప్ప సుగుణాలు శొంఠిలో ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా శొంఠి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు ఒక గ్లాస్ శొంఠి పాలను తీసుకుంటే బోలెడన్ని జబ్బులను దూరం చేసుకోవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం శొంఠి పాలను ఎలా తయారు చేసుకోవాలి.? అసలు నైట్ ఈ పాలను తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటీ.
? వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా స్టవ్ ఆన్ చేని గిన్నె పెట్టుకుని గ్లాస్ కొవ్వు తీసిన పాలు పోయాలి.
ఐదారు నిమిషాల పాటు పాలను మరిగించి.అప్పుడు అందులో పావు స్పూన్ శొంఠి పొడిని వేయాలి.
ఆపై రెండు నిమిషాల పాటు హీట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ పాలల్లో ఒక స్పూన్ తేనెను కలిపి గోరు వెచ్చగా అయిన తర్వాత సేవించాలి.
"""/"/
ఇలా ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు చేస్తే గనుక కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు పరార్ అవుతాయి.
రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.జలుబు, దగ్గు, దొంతు నొప్పి, శ్వాస సమస్యలు ఉంటే తగ్గు ముఖం పడతాయి.
విష జ్వరాలు తగ్గిపోతాయి.అలాగే శొంఠి పాలను నిద్రించే ముందు తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు చురుగ్గా మారి మలబద్ధకం దూరం అవుతుంది.
అదే సమయంలో గ్యాస్, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
అంతే కాదు, శొంఠి పాలను తాగితే మంచిగా నిద్ర పడుతుంది.రక్తంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి పోతుంది.
మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ సైతం కంట్రోల్‌లో ఉంటాయి.
ఇకపై హైదరాబాద్ వాహనదారులు అలా చేస్తే జేబుకు చిల్లె…