ఆరోగ్యానికి వ‌రం శొంఠి కాఫీ.. నిత్యం తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

శొంఠి.( Sonti ) ఈ పేరు మ‌నం వినే ఉంటాము.

అల్లం ను ఎండబెట్టి శొంఠిని త‌యారు చేస్తారు.ఆయుర్వేదంలో దీనిని ఎక్కువ‌గా వినియోగిస్తారు.

అలాగే ప్ర‌స‌వం అనంత‌రం ఒంట్లో నీరు లాగుతుంద‌ని బాలింత‌ల‌కు శొంఠి పొడితో భోజ‌నం పెడుతుంటారు.

శొంఠిలో ఓష‌ధ గుణాలు మెండుగా ఉంటాయి.అందుకే శొంఠిని సర్వరోగ నివారిణి అని కూడా అంటుంటారు.

అయితే మీరు ఎప్పుడైనా శొంఠి కాఫీ( Sonti Coffee ) తాగారా.? చాలా రుచిగా ఉంటుంది.

పైగా మ‌నం రెగ్యుల‌ర్ గా తీసుకునే కాఫీ కంటే ఈ శొంఠి కాఫీ వంద రెట్లు ఎక్కువ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మరి లేటెందుకు శొంఠి కాఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.అది అందించే ఆరోగ్య లాభాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

"""/" / ముందుగా స్ట‌వ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక చిన్న క‌ప్పు వాట‌ర్ వేసుకోవాలి.

వాట‌ర్ మ‌రిగిన త‌ర్వాత అందులో వ‌న్ టీ స్పూన్ శొంఠి పొడి, చిటికెడు మిరియాలు, ( Black Pepper ) నాలుగు తులసి ఆకులు,( Basil Leaves ) వ‌న్ టేబుల్ స్పూన్ తాటి చక్కెర వేసుకుని నాలుగు నిమిషాల పాటు మ‌రిగించాలి.

ఆ త‌ర్వాత ఒక క‌ప్పు పాలు పోసుకుని మ‌రో నాలుగు నిమిషాల పాటు మ‌రిగిస్తే శొంఠి కాఫీ సిద్ధం అవుతుంది.

స్టైన‌ర్ తో కాఫీని ఫిల్టర్ చేసుకుని తాగేడ‌మే.ఒక‌వేళ మీరు మిల్క్ ను స్కిప్ చేయాల‌నుకుంటే బ‌దులుగా వాట‌ర్ ను యాడ్ చేసుకోవ‌చ్చు.

"""/" / శొంఠి కాఫీ ఆరోగ్య ప్ర‌యోజ‌నాల విష‌యానికి వ‌స్తే.ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

అపానవాయువును తగ్గిస్తుంది.అజీర్తి, గ్యాస్‌, మ‌ల‌బ‌ద్ధ‌కం వంటి జీర్ణ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెడుతుంది.

శొంఠి కాఫీ కండరాలు, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సమర్థవంతంగా సహాయపడుతుంది.అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో బాధ‌ప‌డేవారికి శొంఠి కాఫీ ఒక వ‌రమ‌ని చెప్పుకోవ‌చ్చు.

దగ్గు, జలుబు మరియు గొంతు నొప్పి నుండి ఉపశమనం పొందేందుకు శొంఠి కాఫీ చాలా బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.

అయితే ఆరోగ్యానికి మంచిదని శొంఠి కాఫీని అతిగా తీసుకుంటే లేనిపోని స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

కాబ‌ట్టి రోజుకు ఒక క‌ప్పు చొప్పున మాత్ర‌మే తీసుకోవాలి.

అనుదీప్ కె వి విశ్వక్ సేన్ కి సక్సెస్ ఇస్తాడా..?