రోజు ఖాళీ కడుపుతో ఈ కూరగాయ జ్యూస్ ను తాగారంటే షుగర్ కంట్రోల్ తో సహా ఎన్నో లాభాలు మీ సొంతం!

ఇటీవల కాలంలో మధుమేహం( Diabetes ) బాధితుల సంఖ్య అంతకంతకు పెరిగిపోతుంది.నిశ్చల జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం తదితర కారణాల వల్ల ప్రతి ఏడాది కోట్లాది మంది మధుమేహం బారిన పడుతున్నారు.

అయితే మధుమేహం వచ్చిన వారు షుగర్ ను కంట్రోల్ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు.

కానీ రోజు ఖాళీ కడుపుతో ఇప్పుడు చెప్పబోయే కూరగాయ జ్యూస్ ను తాగారంటే షుగర్ కంట్రోల్ తో సహా ఎన్నో లాభాలు మీ సొంతం అవుతాయి.

"""/" / ముల్లంగి.ఈ ప్రకృతి మనకు ప్రసాదించిన అద్భుతమైన కూరగాయల్లో ఒకటి.

ఘాటైన రుచిని కలిగి ఉండే ముల్లంగి( Radish ) తో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.

ముఖ్యంగా సాంబార్ లో ఎక్కువగా ముల్లంగిని వాడుతుంటారు.రుచి గురించి పక్కన పెడితే ముల్లంగిలో ఎన్నో అమోఘమైన పోషకాలు నిండి ఉంటాయి.

రోజు ఖాళీ కడుపుతో ముల్లంగి జ్యూస్‌ తాగితే షుగర్ కంట్రోల్ తో సహా ఎన్నో ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

ముల్లంగి జ్యూస్ తయారు చేసుకోవడం చాలా సులభం. """/" / అందుకోసం బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు ముల్లంగి ముక్కలు వేసుకోవాలి.

అలాగే రెండు టేబుల్ స్పూన్లు లెమన్ జ్యూస్( Lemonade ) , చిటికెడు సాల్ట్ మరియు చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి.

చివరిగా ఒక గ్లాసు వాటర్ పోసి మెత్తగా బ్లెండ్ చేసుకుని స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ను స‌పరేట్ చేసుకోవాలి.

రోజు ఉదయం ఖాళీ కడుపుతో ఈ ముల్లంగి జ్యూస్ ను తీసుకోవడం వల్ల చాలా ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి.

ప్రధానంగా ముల్లంగి జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.మధుమేహం వ్యాధిని కంట్రోల్ లో ఉంచుతుంది.

అలాగే ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు.అలాంటివారు నిత్యం ముల్లంగి జ్యూస్ ను తీసుకుంటే ఒంట్లో కొవ్వు కరుగుతుంది.

వెయిట్ లాస్ అవుతారు అంతేకాదు, ముల్లంగి జ్యూస్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.

రోజంతా మిమ్మల్ని శక్తివంతంగా ఉంచుతుంది.నీరసం, అలసట వంటివి దరిదాపుల్లోకి రాకుండా అడ్డుకట్ట వేస్తుంది.

ముల్లంగి జ్యూస్ జలుబు, దగ్గు వంటి సమస్యలను నివారిస్తుంది.కొలెస్ట్రాల్ ను కరిగించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

కాలేయ పనితీరును పెంచుతుంది.కాబట్టి ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలనుకునే వారు తప్పకుండా ముల్లంగి జ్యూస్ ను డైట్ లో చేర్చుకోండి.

నల్లటి వలయాలను మాయం చేసే సూపర్ పవర్ ఫుల్ రెమెడీస్ ఇవే!