వారెవ్వా.. పైనాపిల్ క్యారెట్ జ్యూస్ తో ఇన్ని ఆరోగ్య లాభాలా?

పైనాపిల్,( Pineapple ) క్యారెట్.( Carrot ) ఇవి రెండు విడివిడిగా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయని మనందరికీ తెలుసు.

అయితే పైనాపిల్, క్యారెట్ లను కలిపి జ్యూస్( Juice ) తయారు చేసుకుని తీసుకోవడం ద్వారా మరిన్ని ఆరోగ్య లాభాలు పొందవచ్చు.

పైనాపిల్, క్యారెట్ జ్యూస్ తయారీ కోసం.ముందుగా ఒక కప్పు పైనాపిల్ ముక్కలు, అర కప్పు క్యారెట్ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి.

ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న పైనాపిల్ మరియు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి.

అలాగే హాఫ్ టీ స్పూన్ ఫ్రెష్ అల్లం ముక్కలు,( Ginger ) నాలుగు లేదా ఐదు పుదీనా ఆకులు( Mint Leaves ) మరియు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుంచి స్ట్రైనర్ సహాయంతో జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తాగేయ‌డమే.

ఈ పైనాపిల్ క్యారెట్ జ్యూస్ టేస్టీగా ఉండడమే కాదు ఎన్నో విలువైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

వారానికి రెండు లేదా మూడుసార్లు ఈ జ్యూస్ ను కనుక ఉదయం పూట తీసుకుంటే అదిరిపోయే ఆరోగ్య లాభాలు మీ సొంతం అవుతాయి.

"""/" / పైనాపిల్‌లో ఉన్న విటమిన్ సి, క్యారెట్‌లోని బీటా-కెరోటిన్ ఇమ్యూన్ సిస్టమ్‌ను బలోపేతం చేస్తాయి.

జ‌లుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య నుంచి త్వ‌ర‌గా రిక‌వ‌రీ అయ్యేలా ప్రోత్స‌హిస్తాయి.అలాగే క్యారెట్‌లో ఉండే పొటాషియం, పైనాపిల్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు హృదయ ఆరోగ్యానికి అండంగా ఉంటాయి.

చెడు కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి గుండె జ‌బ్బుల‌కు అడ్డుక‌ట్ట వేస్తాయి. """/" / పైనాపిల్‌లో ఉండే బ్రోమెలైన్ అనే ఎంజైమ్, క్యారెట్ లో మెండుగా ఉండే ఫైబ‌ర్ జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తాయి.

ఆహారం సులభంగా జీర్ణం అయ్యేలా చేస్తాయి.అంతేకాదు పైనాపిల్ క్యారెట్ జ్యూస్ లో పోష‌కాలు చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

దృష్టి లోపాల‌ను తొల‌గించి కంటి చూపును పెంచుతాయి.బ‌రువు త‌గ్గాల‌ని ప్ర‌య‌త్నిస్తున్న వారికి కూడా ఈ జ్యూస్ ఎంతో అనుకూలంగా ఉంటుంది.

పైగా పైనాపిల్ క్యారెట్ జ్యూస్ శరీరంలోని విషతత్వాలను సైతం తొల‌గిస్తుంది.