బరువు తగ్గాలా.. షుగర్ కంట్రోల్ లో ఉండాలా.. అయితే ఈ డ్రింక్ మీకోసమే!
TeluguStop.com
ప్రస్తుత రోజుల్లో అధిక బరువు తో( Over Weight ) బాధపడుతున్న వారు ఎందరో ఉన్నారు.
అలాగే మధుమేహం( Diabetes ) బాధితుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.ఇంటికి కనీసం ఒక్కరైనా షుగర్ పేషెంట్ ఉంటున్నారు.
అయితే బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారు, షుగర్ ను కంట్రోల్ లో ఉంచుకోవడానికి ట్రై చేస్తున్నవారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ను మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.
ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్లు మెంతులు( Fenugreek Seeds ) మరియు నాలుగు టేబుల్ స్పూన్లు జీలకర్ర(
Cumin Seeds ) వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి.
ఇలా ఫ్రై చేసుకున్న జీలకర్ర మరియు మెంతులను మిక్సీ జార్ లో వేసి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక గ్లాస్ లో హాఫ్ టీ స్పూన్ మేతి జీరా పౌడర్, చిటికెడు పింక్ సాల్ట్, వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ అల్లం జ్యూస్ మరియు హాట్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన డ్రింక్ అనేది రెడీ అవుతుంది.
"""/" /
ఈ మేతి జీరా వాటర్( Methi Jeera Water ) ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు అందిస్తుంది.
రోజు ఉదయం ఈ డ్రింక్ ను కనుక తీసుకుంటే జీవక్రియ చురుగ్గా మారుతుంది.
శరీరంలో కేలరీలు వేగంగా బర్న్ అవుతాయి.ఫలితంగా వెయిట్ లాస్ అవుతారు.
బాన పొట్టను ఫ్లాట్ గా మార్చడానికి కూడా ఈ మేతి జీర వాటర్ సహాయపడతాయి.
అలాగే మధుమేహం ఉన్నవారు నిత్యం ఈ వాటర్ తాగితే చాలా మంచిది.మెంతి గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో తోడ్పడతాయి.
"""/" /
అంతేకాదండోయ్ మేతి-జీరా నీరు శరీరం నుండి విషాన్ని బయటకు పంపుతుంది.
బాడీని డీటాక్స్ చేస్తుంది.మేతి జీరా వాటర్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే చర్మంపై మొటిమలు తగ్గుముఖం పడతాయి.
క్లియర్ స్కిన్ మీ సొంతం అవుతుంది.జీర్ణక్రియ ఆరోగ్యానికి కూడా ఈ డ్రింక్ మద్దతు ఇస్తుంది.
కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలకు సమర్థవంతంగా చెక్ పెడుతుంది.
వైరల్: పీలింగ్స్ పాటకి సెప్పులేసిన ముసలి బామ్మ… రష్మికను మ్యాచ్ చేసిందని కామెంట్స్!