వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే `ఆమ్ పన్నా`.. ఇంట్లో ఈజీగా చేసుకోండిలా!

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే `ఆమ్ పన్నా` ఇంట్లో ఈజీగా చేసుకోండిలా!

వేస‌వి కాలం వ‌చ్చిందంటే చాలు.ఎక్క‌డ్లేని అనారోగ్య స‌మ‌స్య‌లు చుట్టు ముట్టేస్తుంటాయి.

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే `ఆమ్ పన్నా` ఇంట్లో ఈజీగా చేసుకోండిలా!

నీర‌సం, అల‌స‌ట‌, డీహైడ్రేష‌న్‌, త‌ల‌నొప్పి, ఆయాసం, అధిక దాహం.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో స‌మ‌స్య‌లు తీవ్రంగా మ‌ద‌న పెడుతూ ఉంటాయి.

వేసవిలో ఆరోగ్యాన్ని కాపాడే `ఆమ్ పన్నా` ఇంట్లో ఈజీగా చేసుకోండిలా!

అయితే వీట‌న్నిటికీ చెక్ పెట్టి ఆరోగ్యాన్ని కాపాడ‌టంతో ఆమ్ ప‌న్నా అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

అస‌లేంటి ఈ ఆమ్ ప‌న్నా అని అనుకుంటున్నారా.? ఇది ప‌చ్చి మామిడికాయ‌ల‌తో చేసే సూప‌ర్ టేస్టీ రీఫ్రెషింగ్ డ్రింక్.

పైగా ఇది ఎక్క‌డో కాదు.మ‌న ఇండియాలోనే పుట్టింది.

వేస‌విలో చాలా మంది ఈ ఆమ్ ప‌న్నాను తీసుకుంటారు.అయితే మ‌రి ఆమ్ ప‌న్నాను ఇంట్లోనే సుల‌భంగా ఎలా త‌యారు చేసుకోవాలి.

? మ‌రియు ఈ డ్రింక్‌ను తాగ‌డం వ‌ల్ల వ‌చ్చే ఆరోగ్య లాభాలు ఏంటీ.

? అన్న విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక పెద్ద సైజ్ ప‌చ్చి మామిడికాయ‌ను తీసుకుని పై తొక్క‌, లోప‌ల ఉన్న టెంక తొల‌గించి నీటితో శుభ్రంగా క‌డ‌గాలి.

క‌డిగిన మామిడి కాయ‌ను చిన్న చిన్న ముక్క‌లుగా క‌ట్ చేసి.ప్రెజ‌ర్ కుక్క‌ర్‌లో వేసి గ్లాస్ వాట‌ర్ పోసి మూడు విసిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి.

ఇప్పుడు ఒక బ్లెండ‌ర్ తీసుకుని అందులో ఉడికించి చ‌ల్లార‌బెట్టుకున్న మామిడి కాయ ముక్క‌లు, ఐదారు పుదీనా ఆకులు, మూడు టేబుల్ స్పూన్ల బౌన్ షుగ‌ర్‌, హాఫ్‌ టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి, హాఫ్‌ టేబుల్ స్పూన్ న‌ల్ల ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ యాల‌కుల పొడి, కొద్దిగా మిరియాల పొడి వేసి మెత్త‌గా గ్రౌండ్ చేసుకోవాలి.

ఈ మామిడి కాయ మిశ్ర‌మం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే రెండు, మూడు వారాల పాటు నిల్వ ఉంటుంది.

"""/" / ఇక దీనిని ఎలా వాడాలో కూడా చూసేయండి.ఒక గ్లాస్‌లో మూడు ఐస్ క్యూబ్స్‌, వ‌న్ టేబుల్ స్పూన్ త‌యారు చేసి పెట్టుకున్న మామిడికాయ మిశ్ర‌మం మ‌రియు వాట‌ర్ పోసి బాగా మిక్స్ చేసుకుంటే ఆమ్ ప‌న్నా సిద్ధ‌మైన‌ట్లే.

దీనిని రోజుకు ఒక గ్లాస్ చ‌ప్పున తీసుకుంటే బాడీలో వేడి త‌గ్గుతుంది.ఎండ‌ల వ‌ల్ల వ‌చ్చే త‌ల‌నొప్పి, క‌ళ్లు తిర‌గ‌డం వంటి స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

ఒత్తిడి చిత్త‌వుతుంది.డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటారు.

శ‌రీరం యాక్టివ్‌గా, రీ ఫ్రెష్‌గా మారుతుంది.మ‌రియు ఇమ్యూనిటీ సిస్ట‌మ్ సైతం బూస్ట్ అవుతుంది.

ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారు ఖరీదు ఎంతో తెలుసా?

ఖరీదైన కారును కొనుగోలు చేసిన ప్రభాస్ హీరోయిన్.. కారు ఖరీదు ఎంతో తెలుసా?