వామ్మో.. ఎండిన టమాటో తింటే ఇన్ని ఆరోగ్య లాభాలు ల‌భిస్తాయా?

టమాటో.ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే కూరగాయల్లో ఒకటి.

టమాటో తో రకరకాల వంటలు తయారు చేస్తుంటారు.టమాటో తో ఏ వంటకం చేసినా రుచి అదిరిపోతుంది అనడంలో సందేహమే లేదు.

పైగా టమాటోలో బోలెడన్ని పోషక విలువలు నిండి ఉంటాయి.అవి మనం ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలను చేకూరుస్తాయి.

అయితే టమాటోను పచ్చిగానే కాదు ఎండిన తర్వాత తిన్నా బోలెడు ఆరోగ్య లాభాలు పొందొచ్చు.

అవును మీరు విన్న‌ది నిజమే.డ్రై టమాటో‌ను తీసుకోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు లభిస్తాయి.

డ్రై టమాటో మనకు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి.లేదా ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు.

అసలు డ్రై టమోటో వల్ల లభించే బెనిఫిట్స్ తెలిస్తే వెంటనే డైట్ లో చేర్చుకుంటారు.

డ్రై టమాటోలో విటమిన్ సి, విటమిన్ కె, నియాసిన్, కాపర్, ప్రోటీన్, మాంగనీస్, పొటాషియం, ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా నిండి ఉంటాయి.

"""/" / డ్రై టమాటోను తీసుకోవడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ కరుగుతుంది.

గుండె ఆరోగ్యంగా మారుతుంది.గుండెపోటుతో సహా వివిధ రకాల గుండె సంబంధిత జబ్బులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.

డ్రై టమాటో ఇమ్యూనిటీ బూస్టర్ గా కూడా పని చేస్తుంది.రోజుకు రెండు డ్రై టమాటో ముక్కలు తీసుకుంటే రోక నిరోధక వ్యవస్థ చక్కగా బలపడుతుంది.

దాంతో వివిధ రకాల సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి. """/" / డ్రై టమాటోను తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది.

మానసిక సమస్యలు దూరం అవుతాయి.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

కంటి చూపును మెరుగు పరచడానికి కూడా డ్రై టమాటో ఉత్తమంగా సహాయపడుతుంది.డ్రై టమాటో ను డైట్ లో చేర్చుకోవడం వల్ల న్యుమోనియా, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల‌ ప్రమాదం తగ్గు ముఖం పడుతుంది.

ఇక డై టమాటోను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు సైతం అదుపులో ఉంటాయి.

విశ్వం సినిమాతో శ్రీను వైట్లకి మరో దూకుడు అవుతుందా..?