మొక్క జొన్న పీచును పొరపాటున కూడా పారేయకండి..ఎందుకంటే?
TeluguStop.com
మొక్క జొన్న పొత్తులు.పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా చాలా మంది వీటిని ఇష్టపడి తింటుంటారు.
ప్రత్యేకమైన రుచిని కలిగి ఉండే మొక్క జొన్న పొత్తులను కొందరు ఉడికించి తింటే.
మరికొందరు కాల్చుకుని ఆరగిస్తుంటారు.ఇలా ఎలా తిన్నా ఆరోగ్యానికి మంచిదే.
అయితే మొక్క జొన్న పొత్తుల విషయంలో దాదాపు అందరూ చేసే పొరపాటు ఏంటంటే.
పైన ఉండే దారం లాంటి పీచును తీసి పారేయడం.మొక్క జొన్న పొత్తుల మీద ఉండే పీచు దేనేకి పనికి రాదని భావిస్తుంటారు.
అందువల్లనే, పీచును తీసేసి డస్ట్ బిన్‌లోకి తోసేస్తారు.కానీ, మొక్క జొన్న పీచు అనేక అనారోగ్య సమస్యలను నివారించగలదు.
మొక్క జొన్న పీచును కార్న్ సిల్క్ అంటారు.కార్న్ సిల్క్‌తో వాటర్ తయారు చేసుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొక్క జొన్న పీచు వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటీ.
? అసలు మొక్క జొన్న పీచుతో నీటిని ఎలా తయారు చేసుకోవాలి.? వంటి విషయాలను ఓ చూపు చూసేయండి.
ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో గ్లాస్ వాటర్, మొక్క జొన్న పీచు వేసి బాగా మరిగించాలి.
ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు హీట్ చేసిన అనంతరం వాటర్‌ను ఫీల్టర్ చేసుకుని నిమ్మ రసాన్ని యాడ్ చేసుకుంటే కార్న్ సిల్క్ వాటర్ సిద్ధమైనట్టే.
మొక్క జొన్న పీచుతో తయారు చేసిన ఈ వాటర్‌ను ప్రతి రోజూ ఉదయాన్నే సేవిస్తే శరీరంలోని వ్యర్థాలు, విష పదార్థాలు తొలగిపోతాయి.
"""/" /
అలాగే మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్న వారు ఈ కార్న్ సిల్క్ వాటర్‌ను సేవిస్తే.
స్టోన్స్ కరిగి పోవడమే కాకుండా ఇతర కిడ్నీ సంబంధిత సమస్యలన్నీ తగ్గు ముఖం పడతాయి.
అంతే కాదండోయ్.కార్న్ సిల్క్ వాటర్‌ను తాగితే రక్తప్రసరణ చురుగ్గా మారుతుంది.
నీరసం.అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు.మరియు మెదడు పని తీరు సైతం మెరుగ్గా తయారు అవుతుంది.
హరీష్ శంకర్ నిర్మాత గా కిరణ్ అబ్బవరం సినిమా రాబోతుందా..?