కొత్తిమీర ఆకులు తిని కాడలు పారేస్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి!
TeluguStop.com
కొత్తిమీర.దాదాపు అందరి ఇళ్లల్లో వాడే ఒక అద్భుతమైన ఆకు కూర.
వంటలకు చక్కటి రుచి, ఫ్లేవర్‌ను అందించడంలో కొత్తిమీరకు మరేది సాటే లేదు.ముఖ్యంగా నాన్ వెజ్ వంటల్లో కొత్తిమీర లేకుంటే ఏదో వెలితిగానే ఉంటుంది.
ఇక పోషకాల విషయానికి వస్తే.మెగ్నీషియం, కాల్షియం, పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె, థయామిన్, రిబోఫ్లేవిన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో కొత్తిమీరలో నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా, సౌందర్య పరంగా కొత్తిమీర అనేక ప్రయోజనాలను అందిస్తుంది.అయితే చాలా మంది చేసే అతి పెద్ద పొరపాటు ఏంటంటే.
కొత్తిమీరను యూజ్ చేసేటప్పుడు ఆకులను మాత్రం తీసుకుని కాడలను డస్ట్ బిన్‌లోకి తోసేస్తారు.
ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొత్తిమీర ఆకులే కాదు కాడలు కూడా మనకు ఎన్నో విధాలుగా సహాయపడతాయి.
అవును, కొత్తిమీర కాడల్లోనూ పోషక విలువలు మెండుగా ఉంటాయి.వీటిని పారేస్తే సగం ప్రయోజనాలను పోగొట్టుకున్నట్లే అవుతుంది.
ముఖ్యంగా కడుపు అల్సర్‌తో బాధ పడే వారు కొత్తిమీరను కాడలతో సహా తీసుకోవాలి.
తద్వారా కొత్తిమీర కాడల్లో ఉండే సిట్రోనెలోల్ అనే కంటెంట్ కడుపులో ఏర్పడిన పుండ్లును తగ్గించి అల్సర్ నుంచి విముక్తి కలిగిస్తుంది.
అలాగే కొత్తిమీరను కాడలతో సహా తీసుకుంటే.అందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలో పెరుగుతున్న సూక్ష్మజీవులను అరికట్టి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి.
"""/" /
కొత్తిమీర ఆకులతో పోలిస్తే కాడల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.అందువల్ల కాడలను కూడా తింటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది.
అలాగే గ్యాస్, మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
ఇక కాడలతో సహా కొత్తి మీరను తీసుకుంటే గనుక వివిధ రకాల చర్మ సమస్యలకూ దూరంగా ఉండొచ్చు.
మిస్టర్ జగన్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో .. ఏబీవీ హెచ్చరిక