వేసవిలో ఆరోగ్యానికి అండగా నిలిచే సత్తు పానీయం.. రోజు తీసుకుంటే అదిరిపోయే లాభాలు మీ సొంతం!

ప్రస్తుత వేసవి కాలంలో ఎండలు ఏ రేంజ్ లో దంచికొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

వేసవి వేడికి ప్రజలు బెంబేలెత్తుతున్నారు.చెమటలు, ఉక్కపోత, నీరసం, ఆయాసం, అధిక దాహం తో ఆగమాగం అవుతున్నారు.

అయితే ఇటువంటి వేసవి కాలంలో ఆరోగ్యానికి సత్తు పానీయం ఎంతో అండగా ఉంటుంది.

పైగా సత్తు పానీయం చేసుకోవడం కూడా చాలా సులభం. """/" / ముందుగా ఒక గ్లాసు తీసుకుని అందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సత్తు పౌడర్( Sattu Powder ) ను వేసుకోవాలి.

అలాగే కొద్దిగా వాటర్ పోసి ఉండలు లేకుండా సత్తు పౌడర్ ను కలుపుకోవాలి.

ఆపై అందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం పొడి వేసి మరోసారి కలుపుకోవాలి.

ఫైనల్ గా ఒక గ్లాసు చిల్డ్ వాటర్‌, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్, పావు టేబుల్ స్పూన్ వేయించిన‌ జీలకర్ర పొడి మరియు రెండు ఐస్ క్యూబ్స్ వేసుకుని బాగా మిక్స్ చేస్తే సత్తు పానీయం సిద్ధం అవుతుంది.

"""/" / వేసవికాలంలో ఈ సత్తు పానీయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

సత్తులో ఐరన్, సోడియం, ఫైబర్, ప్రొటీన్, మెగ్నీషియం తదితర పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

సత్తు పౌడర్‌ను పైన చెప్పిన విధంగా తీసుకుంటే వేసవిలో నీరసం, అలసట వంటివి మీ దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.

వేసవి తాపం తీరుతుంది.అలాగే ఈ సత్తు పానీయాన్ని ఖాళీ కడుపుతో తాగితే శరీరంలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి.

కడుపు సంబంధిత సమస్యల ( Digestive Problems )నుంచి కూడా మీకు ఉపశమనం లభిస్తుంది.

అంతేకాదు.రోజంతా శరీరాన్ని చల్లగా మరియు హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడే గుణాలు ఈ సత్తు పానీయంలో ఉన్నాయి.

ప్రోటీన్ రిచ్‌గా ఉండ‌టం వ‌ల్ల ఈ సత్తు పానీయం శరీరానికి బోలెడంత శక్తిని అందిస్తుంది.

వెయిట్ లాస్ ను ప్రమోట్ చేస్తుంది.మధుమేహం ఉన్నవారికి కూడా సత్తు పానీయం ఉత్తమమైన ఆహారంగా చెప్పబడింది.

సింగపూర్ అధ్యక్షుడి హోదాలో తొలిసారిగా భారత్‌కు .. ఎవరీ థర్మన్ షణ్ముగరత్నం?