వర్షాకాలంలో వేడివేడిగా చికెన్ సూప్ తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలు పొందవచ్చో తెలుసా?

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే.వర్షాకాలం అంటేనే రోగాల కాలం.

ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ఏదో ఒక జబ్బు వచ్చి నెత్తిన కూర్చుంటుంది.

అందుకే మిగిలిన సీజన్లతో పోలిస్తే వర్షాకాలంలో హెల్త్ విషయంలో కాస్త ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి.

ముఖ్యంగా డైట్ లో పోషకాహారం ఉండేలా చూసుకోవాలి.అయితే వర్షాకాలంలో మన ఆరోగ్యానికి మేలు చేసే ఫుడ్స్ లో చికెన్ సూప్( Chicken Soup ) ఒకటి.

అవును మీరు విన్నది నిజమే.వర్షాకాలంలో వేడివేడిగా చికెన్ సూప్‌ తాగితే బోలెడు ఆరోగ్య లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

చికెన్ సూప్‌లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్‌ గా ఉంటాయి.ఇవి మన రోగ నిరోధక వ్యవస్థ( Immune System )ను బలపరచడానికి అద్భుతంగా తోడ్పడతాయి.

జలుబు, దగ్గు, గొంతు నొప్పి, గొంతు వాపు వంటి సమస్యలతో బాధపడుతున్న వారు వేడివేడిగా చికెన్ సూప్‌ తాగితే ఆయా సమస్యలన్నీ పరార్ అవుతాయి.

"""/" / అలాగే చికెన్ సూప్ ను డైట్ లో చేర్చుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ ( Digestive System )చురుగ్గా మారుతుంది.

గ్యాస్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలు తరచూ వేధించకుండా ఉంటాయి.

ప్రస్తుత ఈ వర్షాకాలంలో బద్ధకం చాలా అధికంగా ఉంటుంది.అలాంటి సమయంలో వేడివేడిగా చికెన్ సూప్‌ తాగితే ఫుల్ ఎనర్జిటిక్ గా యాక్టివ్ గా మారతారు.

పనిపై ఏకాగ్రత పెరుగుతుంది.బ్రెయిన్ షార్ప్ గా పని చేస్తుంది.

"""/" / అలాగే చికెన్ సూపర్ లో ప్రోటీన్, కాల్షియం, అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.

ఇవి కండరాల బలహీనతకు చెక్ పెడతాయి.ఎముకలను దృఢంగా మారుస్తాయి.

అంతేకాదు చికెన్ సూప్ ను తీసుకోవడం వల్ల శరీర బరువు నియంత్రణలో ఉంటుంది.

అధిక రక్తపోటు సమస్య( Blood Pressure ) దూరం అవుతుంది.బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడానికి కూడా చికెన్ సూప్ స‌హాయ‌పడుతుంది.

కాబట్టి ప్రస్తుత ఈ వర్షాకాలంలో కనీసం రెండు మూడు సార్లు అయినా చికెన్ సూప్ ను తీసుకోవడానికి ప్రయత్నించండి.

చలికాలంలో చేతులు పొడిబారకుండా మృదువుగా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి!