బ్రెజిల్ నట్స్ రెగ్యుల‌ర్‌గా తింటే..ఎన్ని హెల్త్ బెనిఫిట్సో తెలుసా?

న‌ట్స్‌లో ఎన్నో ర‌కాలు ఉన్నాయి.వాటిలో బ్రెజిల్ న‌ట్స్ కూడా ఒక‌టి.

కానీ, చాలా మందికి వీటి గురించి తెలియ‌దు.అయితే బ్రెజిల్ న‌ట్స్‌లో ఉండే పోష‌క‌ విలువ‌ల‌, అవి అందించే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి తెలిస్తే ఖ‌చ్చితంగా అంద‌రూ వాటిని డైట్‌లో చేర్చుకుంటారు.

మ‌రి ఆల‌స్యం చేయ‌కుండా బ్రెజిల్ న‌ట్స్ వ‌ల్ల వ‌చ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.

</br.సెలెనియం, ఐర‌న్‌, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, ఒమేగా-3 ఫాట్టీ యాసిడ్స్, విటమిన్ సి, విట‌మిన్ ఇ, విటిమ‌న్ బి, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా బోలెడ‌న్ని పోష‌కాలు బ్రెజిల్ న‌ట్స్‌లో నిండి ఉంటాయి.

అందుకే ఆరోగ్యానికి బ్రెజిల్ న‌ట్స్ అనేక ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.రెగ్యుల‌ర్‌గా డైట్‌లో ఈ న‌ట్స్‌ను చేర్చుకుంటే బ‌ల‌హీన‌మైన ఎముక‌లు, కండ‌రాలు బ‌లంగా మార‌తాయి.

సంతాన‌లేమితో బాధ ప‌డే దంప‌తుల‌కు బ్రెజిల్ న‌ట్స్ ఒక వ‌రంగా చెప్పుకోవ‌చ్చు.అవును, వీటిని ప్ర‌తి రోజు త‌గిన మోతాదులో తీసుకుంట .

పురుషుల్లో వీర్య క‌ణాల వృద్ధి జ‌రుగుతుంది.మ‌రియు స్త్రీలో గర్భాశయ స‌మ‌స్య‌ల‌ను నివారించి సంతానోత్పత్తిని పెంచుతాయి.

అలాగే బ్రెజిల్ న‌ట్స్‌ను తిన‌డం వ‌ల్ల వ్యాధి నిరోధ‌క శక్తి పెరుగుతుంది.దాంతో అనేక వ్యాధిలు మీ ద‌రి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.

"""/" / అంతేకాదు, ప్ర‌తి రోజు బ్రెజిల్ న‌ట్స్‌ను తింటే మొటిమ‌లు, మ‌చ్చ‌లు పోయి చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.

థైరాయిండ్ గ్రంథి సక్ర‌మంగా ప‌ని చేస్తుంది.శ‌రీరంలో ప్రోటీన్ కొర‌త ఏర్ప‌డ‌కుండా ఉంటుంది.

ఒత్తిడి, ఆందోళ‌న‌, డిప్రెష‌న్ వంటి మాన‌సిక స‌మ‌స్య‌లు త‌గ్గి మెద‌డు షార్ప్‌గా, యాక్టివ్‌గా మారుతుంది.

గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.శ‌రీరంలో అధిక వేడి దూరం అవుతుంది.

మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.మ‌రియు క్యాన్స‌ర్‌కు కార‌ణ‌మ‌య్యే క‌ణాలు వృద్ధి చెంద‌కుండా ఉంటాయి.

కాబ‌ట్టి, ఇక‌పై బాదం, పిస్తా, జీడిప‌ప్పు వంటి న‌ట్స్ మాత్ర‌మే కాకుండా బ్రెజిల్ న‌ట్స్ నూ డైట్‌లో చేర్చుకోండి.

ఆరోగ్యంగా ఉండండి.

బ్రెజిల్‌లో వరదలు: ఈ ఇంట్లో చోటు చేసుకున్న ఆసక్తికర దృశ్యం చూస్తే ఫిదా..??