అకాయ్ బెర్రీల గురించి ఈ విషయాలు తెలిస్తే తినకుండా ఉండలేరట!
TeluguStop.com
బెర్రీ పండ్లలో ఎన్నో రకాలు ఉన్నాయి.వాటిలో అకాయ్ బెర్రీలు కూడా ఒకటి.
ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే అకాయ్ బెర్రీల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోషక విలువలు నిండి ఉంటాయి.
అందకే అకాయ్ బెర్రీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.మరి లేట్ చేయకుండా అకాయ్ బెర్రీలు తినడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి.
ప్రస్తుతం ఓవైపు కరోనా, మరోవైపు వర్షాకాలంలో విజృంభించే వ్యాధులతో సతమతమవుతున్న ప్రజలు రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే డైట్‌లో అకాయ్ బెర్రీలను చేరుకుంటే గనుక.అందులో ఉండే విటమిన్ సి మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీని సూపర్‌గా పెంచుతాయి.
అకాయ్ బెర్రీలను తరచూ తీసుకుంటే గనుక అతి ఆకలి సమస్య తగ్గు ముఖం పడుతుంది.
వెయిట్ లాస్ సైతం అవుతాయి.అలాగే పైన చెప్పుకున్నట్టు అకాయ్ బెర్రీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది.
అందు వల్ల వీటిని తీసుకుంటే జీర్ణ వ్యవస్థ చురుగ్గ మారుతుంది.దాంతో జీర్ణ సమస్యలు దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.
"""/"/
అకాయ్ బెర్రీలను తీసుకోవడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది.నీరసం, అలసట వంటివి దూరం అవుతాయి.
అంతేకాదు, డైట్‌లో అకాయ్ బెర్రీలు ఉంటే.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుతాయి.చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా మెరిసిపోతుంటుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.మరియు రక్త పోటు స్థాయిలు అదుపు తప్పకుండా ఉంటాయి.
సో.ఇన్ని బెనిఫిట్స్‌ను అందించే అకాయ్ బెర్రీలను ఇకపై మీ డైట్‌లో చేర్చుకుంటారు కదూ.
భారతీయ వ్యక్తి ఇంటి తలుపు తట్టిన అదృష్ట దేవత..