వామ్మో..ఉత్తరేణితో ఇన్ని లాభాలు ఉన్నాయా?
TeluguStop.com
ఉత్తరేణి మొక్క పేరును వినే ఉంటారు.పల్లెటూర్లలో ఉత్తరేణి మొక్కలు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంటాయి.
సాధారణంగా ఉత్తరేణి ఆకులను పూజకు ఉపయోగిస్తారు.ముఖ్యంగా వినాయక చవితి నాడు ఆ దేవుడికి సమర్పించే పాత్రల్లో ఉత్తరేణి ఒకటి.
ఎన్నో ఔషధ గుణాలు నిండి ఉత్తరేణి మొక్క.అనేక జబ్బులను నివారించడంలో అద్భుతంగా సహాయ పడుతుంది.
మరి ఈ మొక్క యొక్క ఉపయోగాలు ఏంటీ? ఎలా వాడాలి? అన్న విషయాలు ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసు కుందాం.
కీళ్ల నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధ పడే వారికి ఉత్తరేణి ఆకులు ఔషధంగా పని చేస్తాయి.
కొన్ని ఉత్తరేణు ఆకులను తీసుకుని మెత్తగా నూరి ముద్దలా చేసుకోవాలి.ఇప్పుడు ఈ ముద్దను నొప్పి ఉన్న చోట పెట్టి కట్టు కట్టాలి.
ఇలా చేస్తే నొప్పి నుంచి ఇట్టే ఉపశమనం లభిస్తుంది.అలాగే పొట్ట చుట్టు పేరుకు పోయిన కొవ్వును కరిగించడం లోనూ ఉత్తరేణి ఆకులు ఉపయోగ పడుతుంది.
ఉత్తరేణు ఆకుల నుంచి రసం తీసుకుని అందులో నువ్వుల నూనె పోసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి పొట్ట చుట్టు అప్లై చేసుకుని మర్ధన చేసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తే కొవ్వు కరుగుతుంది. """/" /
పంటి నొప్పి, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుంచి రక్తం కారడం వంటి సమస్యలు ఇబ్బంది పెడుతుంటే.
ఉత్తరేణి ఆకులో రసాన్ని దూది సాయంతో నొప్పి పడుతున్న పంటిపై మరియు చిగుళ్లపై అప్లై చేసుకోవాలి.
కొంత సమయం తర్వాత గోరు వెచ్చని నీటితో నోటిని శుభం చేసుకోవాలి.ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
రక్త స్రావాన్ని అరికట్టడం లోనూ ఉత్తరేణి ఆకు గ్రేట్‌గా సహాయ పడుతుంది.ఏదైనా దెబ్బ తగిలినప్పుడు ఉత్తరేణి ఆకు రసాన్ని అప్లై చేస్తే.
రక్త స్రావం ఆగి పోతుంది.ఇక చర్మంపై దద్దుర్లు ఏర్పడి మంట, దురద, నొప్పి పడుతుంటే.
ఉత్తరేణి ఆకు రసం పూయాలి.ఇలా చేస్తే ఇట్టే ఉపశమనం పొందుతారు.
40 లోనూ నవ యవ్వనంగా కనిపించాలనుకుంటే ఈ రెమెడీని మిస్ అవ్వకండి!