ఒత్తిడిని చిత్తు చేసే డ్రాగన్ ఫ్రూట్.. ఇలా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!

డ్రాగన్ ఫ్రూట్.దీని గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు.

ఈ ప్రకృతి మనకు అందించిన అద్భుతమైన పండ్లలో ఇది ఒకటి.చూపుల‌కు ఎంతో ఆకర్షణీయంగా కనిపించే డ్రాగన్ ఫ్రూట్ లో ఎన్నో పోషక విలువలు నిండు ఉంటాయి.

అవి మన ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.ముఖ్యంగా తీవ్ర‌మైన‌ ఒత్తిడిని క్షణాల్లో చిత్తు చేసే సామర్థ్యం డ్రాగన్ ఫ్రూట్ కు ఉంది.

అలాగే మరిన్ని హెల్త్ బెనిఫిట్స్ ను సైతం అందిస్తుంది.అందుకోసం ఒక డ్రాగన్ ఫ్రూట్ ను తీసుకుని లోపల ఉండే పల్ప్ ను సెపరేట్ చేసుకోవాలి.

అలాగే ఒక అరటి పండును తీసుకుని పీల్ తొలగించి చిన్న చిన్న ముక్క‌లుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి.

ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో డ్రాగ‌న్‌ ఫ్రూట్ పల్ప్ మరియు కట్ చేసి పెట్టుకున్న అరటి పండు ముక్కలు వేసుకోవాలి.

అలాగే మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక గ్లాస్ హోమ్ మేడ్‌ ఆల్మండ్ మిల్క్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మన టేస్టీ అండ్ హెల్తీ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీ సిద్దం అవుతుంది.

ఈ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీని డైట్ లో కనుక చేర్చుకుంటే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు దూరం అవుతాయి.

"""/"/ మెదడు పని తీరు చురుగ్గా మారుతుంది.అలాగే ఈ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీని తీసుకోవడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా మారతాయి.

మధుమేహం వచ్చే రిస్క్ తగ్గుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.

జీర్ణ వ్యవస్థ చురుగ్గా పని చేస్తుంది.మూత్ర పిండాలు శుభ్రంగా ఆరోగ్యంగా మారతాయి.

హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది.వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా ద‌రి చేర‌కుండా ఉంటాయి.

మ‌రియు చర్మం కాంతివంతంగా సైతం మెరుస్తుంది.ఇన్ని ప్రయోజనాలు అందించే ఈ డ్రాగన్ ఫ్రూట్ స్మూతీని తప్పకుండా డైట్ లో చేర్చుకుంటారు కదా! .

కమెడియన్ సుబ్బరాజు భార్య ఎవరు.. ఆమె ఏం చేస్తారో తెలుసా?