చ‌లికాలంలో వేపాకు నీటితో స్నానం చేస్తే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప్ర‌స్తుతం చలి కాలం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.ఈ సీజ‌న్‌లో వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుల కార‌ణంగా వివిధ ర‌కాల చ‌ర్మ సంబంధిత స‌మ‌స్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.

ముఖ్యంగా డ్రై స్కిన్‌, ర్యాషెస్‌, దుర‌ద‌లు అల‌ర్జీలు వంటివి తెగ విసిగిస్తుంటాయి.అయితే వీటన్నింటికీ దూరంగా ఉండాలని కోరుకునే వారికి వేపాకులు అద్భుతంగా స‌హాయ‌ప‌డ‌తాయి.

అవును, ప్ర‌తి రోజు వేపాకు నీటితో స్నానం చేస్తే మ‌స్తు స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను సొంతం చేసుకోవ‌చ్చు.

మ‌రి ఇంకెందుకు ఆల‌స్యం ఆ బెనిఫిట్స్ ఏంటో ఓ చూపు చూసేయండి.పొడి చ‌ర్మంతో స‌త‌మ‌తం అవుతున్న వారు గుప్పెడు వేపాకులు వేసి మ‌రిగించిన నీటితో స్నానం చేయ‌డం లేదా మ‌రిగిన వేడి నీటితో వేప నూనె క‌లిపి స్నానం చేయ‌డం చేయాలి.

ఇలా ప్ర‌తి రోజు చేస్తే గ‌నుక వేపాకుల్లో ఉండే ప‌లు పోష‌కాలు చ‌ర్మంపై తేమ‌ను పెంచి త‌ర‌చూ పొడి బార కుండా ర‌క్షిస్తుంది.

అలాగే వేపాకు నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌ర్మంపై బ్యాక్టీరియా, ఇన్ఫెక్ష‌న్లు నాశనం అవుతాయి.

త‌ద్వారా అల‌ర్జీలు, ర్యాషెస్‌, దుర‌ద‌లు వంటివి త‌గ్గు ముఖం ప‌డ‌తాయి. """/" / వేపాకులు వేసి మ‌రిగించిన నీటితో రెగ్యుల‌ర్‌గా బాత్ చేస్తే గ‌నుక మొండి మొటిమ‌లు, న‌ల్ల మ‌చ్చ‌లు, ముడ‌త‌లు త‌గ్గ‌డ‌మే కాదు.

మ‌ళ్లీ మ‌ళ్లీ రాకుండా కూడా ఉంటాయి. """/" / ఇక ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా దాదాపు చాలా మంది చుండ్రు స‌మ‌స్య‌తో ఎంత‌గానో ఇబ్బంది ప‌డుతున్నారు.

అయితే అలాంటి వారు వారంలో రెండంటే రెండు సార్లు వేపాకులు వేసి మ‌రిగించిన నీటితో త‌ల స్నానం చేయాలి.

ఇలా చేస్తే చుండ్రు ప‌రార్ అయిపోతుంది.మ‌రియు జుట్టు ఆరోగ్యం సైతం మెరుగ్గా మారుతుంది.

అర్జున్ రెడ్డి విషయంలో సందీప్ ఎందుకంత రిస్క్ చేశాడు..?