మునగాకు నూనె తో ఇన్ని లాభాలా.. వారానికి 2 సార్లు వాడితే జుట్టు సమస్యలన్నీ పరార్!

మునగాకు( Moringa (.దీనిని తక్కువ అంచనా వేస్తే మీరు పప్పులో కాలేసినట్టే.

నిజానికి అద్భుతమైన ఆకుకూరల్లో మునగాకు ముందు వరుసలో ఉంటుంది.మునగాకులో ఎన్నో విలువైన పోషకాలు నిండి ఉంటాయి.

శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ మునగాకు ద్వారా పొందవచ్చు.అలాగే జుట్టు సంరక్షణ( Hair )కు కూడా మునగాకు ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా మునగాకు నూనెతో ఎన్నో అద్భుతమైన లాభాలు ఉన్నాయి.వారానికి కేవలం రెండు సార్లు మునగాకు నూనె వాడితే జుట్టు సమస్యలన్నీ పరార్ అవుతాయి.

మరి ఇంతకీ మునగాకు నూనెను ఎలా తయారు చేసుకోవాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

"""/" / ముందుగా రెండు కప్పులు మునగాకు తీసుకొని వాటర్ లో ఒకటికి రెండుసార్లు కడిగి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి.

మునగాకు పూర్తిగా ఆరిన తరువాత స్టవ్ ఆన్ చేసి మందపాటి గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు కొబ్బరి నూనె( Coconut Oil ), ఒక కప్పు నువ్వుల నూనె పోసుకోవాలి.

ఆయిల్ కాస్త హీట్ అవ్వగానే అందులో మునగాకు వేసుకోవాలి.అలాగే నాలుగు పొట్టు తొలగించి దంచిన వెల్లుల్లి రెబ్బలు( Garlic), నాలుగు మిరియాలు వేసుకొని స్లో ఫ్లేమ్ పై పది నుంచి పదిహేను నిమిషాల పాటు ఉడికించాలి.

ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయిన అనంతరం స్టైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని ఒక బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.

నైట్ నిద్రించే ముందు ఈ మునగాకు నూనెను స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి అప్లై చేసుకుని కాసేపు హెడ్ మసాజ్ చేసుకోవాలి.

మరుసటి రోజు ఉదయాన్నే మైల్డ్ షాంపూ ను ఉపయోగించి తలస్నానం చేయాలి. """/" / వారానికి రెండు సార్లు ఈ ఆయిల్ ను ఉపయోగిస్తే మీ జుట్టు రాలమన్నా రాలదు.

ఈ మునగాకు నూనె జుట్టు రాలడాన్ని అరికడుతుంది.కుదుళ్లను బలోపేతం చేస్తుంది.

హెయిర్ గ్రోత్( Hair Growth ) ను ఇంప్రూవ్ చేస్తుంది.ఈ మునగాకు నూనెను వాడటం వల్ల జుట్టు కొద్ది రోజుల్లోనే ఒత్తుగా పొడుగ్గా మారుతుంది.

తెల్ల జుట్టు( White Hair ) త్వరగా రాకుండా ఉంటుంది.తలలో చుండ్రు ఉంటే మాయం అవుతుంది.

చిట్లిన జుట్టు సైతం రిపేర్ అవుతుంది.కాబట్టి ఒత్తైన పొడవైన నల్లటి మెరిసే కురుల కోసం తప్పకుండా ఈ మునగాకు నూనెను వాడేందుకు ప్రయత్నించండి.

జుట్టు రాలే సమస్యతో ఇక నో వర్రీ.. ఇలా చెక్ పెట్టేయండి..!