జోజోబా నూనె ఉపయోగాలు తెలిస్తే..వాడకుండా ఉండలేరట!
TeluguStop.com
జోజోబా నూనె.అద్భుతమైన నూనెల్లోనూ ఇది ఒకటి అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.
జొజోబా మొక్కల గింజల నుండి ఈ నూనెను తయారు చేస్తారు.ఎన్నో పోషక విలువలను కలిగి ఉండే ఈ జోజోబా నూనె చర్మ సౌందర్యాన్ని పెంచడంలోనూ, కురులను సంరక్షించడంలోనూ సూపర్‌గా సహాయపడుతుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం.అసలు ఈ జోజోబా నూనెను ఎలా వాడాలి.
? దీనిని వాడటం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటీ.? వంటి విషయాలను చూసేయండి.
చాలా మంది తమ స్కిన్ డ్రైగా మారిపోతుందని బాధ పడుతున్నారు.అయితే జోజోబా నూనె ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్‌గా పని చేస్తుంది.
ఈ ఆయిల్‌ను స్నానం చేసిన తర్వాత చర్మానికి అప్లై చేసుకోవాలి.లేదా మీరు వాడే మాయిశ్చరైజర్‌లో ఈ ఆయిల్‌ను మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి.
ఇలా ఎలా చేసినా మీ చర్మం ఎక్కువ సమయం పాటు తేమగా మరియు మృదువుగా ఉంటుంది.
పొడిబారిన, పగిలిన పెదవులను స్మూత్ అండ్ సాప్ట్‌గా మార్చడంలో జోజోబా ఆయిల్ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది.
ప్రతి రోజు రాత్రి నిద్రించే ముందు లిప్స్‌కు కొద్దిగా జోజోబా నూనె అప్లై చేసి స్మూత్‌గా మసాజ్ చేసుకోవాలి.
ఇలా రెగ్యులర్‌గా చేస్తే పెదవులు అందంగా తయారవుతాయి. """/" /
అలాగే నైట్ క్రీమ్‌లో కొద్దిగా జోజోబా ఆయిల్‌ను యాడ్ చేసి.
ముఖానికి రాసుకోవాలి.ఇలా రెగ్యులర్‌గా చేస్తే గనుక ముడతల సమస్య దరి చేరకుండా ఉంటుంది.
మరియు మీ స్కిన్ ఎల్లప్పుడూ గ్లోగా మెరిసిపోతుంది.ఇక కేశాలకు కూడా జోజోబా నూనె ఎంతో మేలు చేస్తుంది.
తల స్నానం చేసే గంట ముందు ఈ జోజోబా నూనెను తలకు పట్టించి కాసేపు మర్ధనా చేసుకోవాలి.
వారంలో రెండు సార్లు ఇలా చేస్తే హెయిర్ ఫాల్ సమస్య తగ్గు ముఖం పడుతుంది.
తలపై పేరుకు పోయిన దుమ్ము, ధూళి, మురికి తొలిగిపోతాయి.మరియు చుండ్రు సమస్య నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది.
కొత్త ఆఫర్లకు నో చెబుతున్న ప్రభాస్ బ్యూటీ.. ప్రభాస్ వల్లే ఈ సమస్య ఎదురైందా?