హనీ ఫేషియల్..వారంలో ఒక్కసారి చేసుకుంటే మస్తు బెనిఫిట్స్!
TeluguStop.com
హనీ(తేనె).మధురమైన రుచిని కలిగి ఉండటమే కాదు అమోఘమైన పోషకాలు కూడా నిండి ఉంటాయి.
అందుకే ఆరోగ్య పరంగా తేనె అనేక ప్రయోజనాలను చేకూరుస్తుంది.చర్మ సౌందర్యానికీ తేనె ఎంతో మేలు చేస్తుంది.
ముఖ్యంగా తేనెతో వారానికి ఒక్కసారి ఇంట్లోనే ఫేషియల్ చేసుకుంటే గనుక బోలెడన్ని స్కిన్ కేర్ బెనిఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు.
మరి లేటెందుకు హనీతో ఫేషియల్ ఎలా చేసుకోవాలో కిందకు ఓ లుక్కేసేయండి.h3 Class=subheader-styleస్టెప్-1:/h3p ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో రెండు టేబల్ స్పూన్ల తేనె, వన్ టేబుల్ స్పూన్ కీరా జ్యూస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఆ తర్వాత దూది సాయంతో ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టింది రెండు, మూడు నిమిషాల పాటు క్లెన్సింగ్ చేసుకోవాలి.
ఆపై గోరు వెచ్చని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.h3 Class=subheader-styleస్టెప్-2: /h3pఒక బౌల్ తీనుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ గోధుమ రవ్వ, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి కేవలం రెండు నిమిషాల పాటు స్మూత్‌గా స్క్రబ్ చేసుకోవాలి.
స్క్రబ్బింగ్ అయిన తర్వాత నార్మల్ వాటర్‌తో ఫేస్‌ను క్లీన్ చేసుకోవాలి. """/"/
H3 Class=subheader-styleస్టెప్-3:/h3p బౌల్‌లో వన్ టేబుల్ స్పూన్ తేనె, వన్ టేబుల్ స్పూన్ ఆల్మండ్ ఆయిల్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేసుకుని.అప్పుడు నీటితో చర్మాన్ని శుభ్రపరుచుకోవాలి.
"""/"/
H3 Class=subheader-styleస్టెప్-4:/h3p బౌల్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల చందనం పొడి, వన్ టేబుల్ స్పూన్ తేనె, రెండు చుక్కలు నిమ్మ రసం, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసుకుని కలుపుకోవాలి.
ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా పట్టించి.ఇరవై నిమిషాల అనంతరం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
ఈ విధంగా తేనెతో ఫేషియల్ చేసుకోవడం వల్ల ముఖం ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
మొటిమలు, మొండి మచ్చలు ఉంటే క్రమంగా తగ్గుతాయి.త్వరగా చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి.
మరియు ముఖ చర్మం స్మూత్‌గా కూడా ఉంటుంది.
బాయ్‌ఫ్రెండ్ భారతీయుడని తెలిసి పాకిస్థానీ గర్ల్ ఎలా రచ్చ చేస్తుందో చూడండి..