ఫ్లాక్స్ సీడ్స్ ఫేషియ‌ల్‌.. ఒక్క‌సారి ట్రై చేస్తే చ‌ర్మ స‌మ‌స్య‌ల‌న్నీ పరార్‌!

ఫ్లాక్స్ సీడ్స్.వీటినే తెలుగులో అవిసె గింజ‌లు అని అంటారు.

ఎన్నో పోష‌క విలువ‌ల‌ను క‌లిగి ఉండే ఫ్లాక్స్ సీడ్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

బోలెడ‌న్ని ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తాయి.అలాగే అనేక చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను వ‌దిలించ‌డంలోనూ ఫ్లాక్స్ సీడ్స్ ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా ఫ్లాక్స్ సీడ్స్‌తో ఇంట్లోనే ఇప్పుడు చెప్పే విధంగా ఫేషియ‌ల్ చేసుకుంటే చ‌ర్మ స‌మ‌స్య‌లెన్నిటినో నివారించుకోవ‌చ్చు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు ఫ్లాక్స్ సీడ్స్‌తో ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలో చూసేయండి.ముందుగా గిన్నెలో గ్లాస్ వాట‌ర్ పోసి రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ వేసి పావు గంట నుంచి ఇర‌వై నిమిషాల పాటు వేడి చేస్తే జెల్లీగా మారుతుంది.

అప్పుడు ఈ మిశ్ర‌మాన్ని చ‌ల్లార‌నిచ్చి.ఆపై గింజ‌లు లేకుండా జెల్‌ను వేరు చేసి డ‌బ్బాలో స్టోర్ చేసుకోవాలి.

ఇప్పుడు ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం.h3 Class=subheader-styleస్టెప్-1:/h3p ఒక బౌల్‌లో స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్‌, అర స్పూన్ పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి రెండు నుంచి మూడు నిమిషాల పాటు క్లెన్సింగ్ చేసుకుకోవాలి.

క్లెన్సింగ్ అనంత‌రం వాట‌ర్‌తో ఫేస్ వాష్ చేసుకోవాలి.h3 Class=subheader-styleప్టెప్‌-2: /h3pబౌల్‌లో తీసుకుని అందులో రెండు స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ పౌడ‌ర్‌, ఒక స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మ‌రియు అర స్పూన్ గ్లిజ‌రిన్ వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప‌ట్టించి స్క్ర‌బ్బింగ్ చేసుకోవాలి.ఆపై వాట‌ర్‌తో శుభ్ర ప‌రుచుకోవాలి.

"""/"/ H3 Class=subheader-styleస్టెప్‌-3: /h3pబౌల్‌లో తీసుకుని అందులో స్పూన్ గోధుమ పిండి, స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ పొడి, స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మ‌రియు రెండు స్పూన్ల రోజ్ వాట‌ర్ చేసుకుని మిక్స్ చేసి.

ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి.పావు గంట అనంత‌రం ఫేస్ వాష్ చేసుకోవాలి.

అంతే ఇలా వారంలో ఒక్క‌సారి ఫేషియ‌ల్ చేసుకోవ‌డం వ‌ల్ల మొటిమ‌లు త‌గ్గుతాయి.

పిగ్మెంటేష‌న్ స‌మ‌స్య ప‌రార్ అవుతుంది.ఫేస్ వైట్‌గా, బ్రైట్‌గా మారుతుంది.

మ‌రియు వృద్ధాప్య ఛాయ‌ల నుంచి విముక్తి ల‌భిస్తుంది.

దేవర రికార్డును బ్రేక్ చేసిన పెద్ది.. రామ్ చరణ్ సంచలనాలకు తెర తీశాడుగా!