జీడి‌ప‌ప్పుతో ఇలా చేస్తే.. ముఖం య‌వ్వ‌నంగా మెరిసిపోవాల్సిందే!

జీడిప‌ప్పు.వీటినే ప‌లు చోట్ల కాజూ అని కూడా అంటారు.

జీడిప‌ప్పు రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.వంట‌ల్లో విడి విడిగా ఉప‌యోగించే జీడిప‌ప్పులో ఎన్నో పోష‌క విలువ‌లు దాగి ఉన్నాయి.

ఐరన్‌, మాంగనీస్‌, సెలీనియం, కాపర్‌, ఫాస్పరస్‌, జింక్ వంటి మిన‌ర‌ల్స్ పాటు ప‌లు విట‌మిన్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్‌, గుడ్ ఫ్యాట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు జీడిప‌ప్పులో ఉంటాయి.

అయితే ఇవి కేవ‌లం ఆరోగ్యానికే కాదు.సౌందర్య ప‌రంగా కూడా అద్భుతంగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ముఖ్యంగా చ‌ర్మాన్ని య‌వ్వ‌నంగా మార్చ‌డంలో జీడిప‌ప్పులు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.మ‌రి జీడిప‌ప్పులను చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా జీడిప‌ప్పుల‌ను తీసుకుని మొత్త‌గా పౌడ‌ర్ చేసుకోవాలి.ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని.

అందులో ఒక స్పూన్ జీడిప‌ప్పుల పౌడ‌ర్‌, అర స్పూన్ బాదం పౌడ‌ర్ మ‌రియు పాలు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు ఆర‌నివ్వాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా వారానికి ఒక సారి చేయ‌డం వ‌ల్ల ముఖంపై ముడ‌తలు, స‌న్న‌ని చార‌లు త‌గ్గి.

య‌వ్వ‌నంగా మ‌రియు కాంతివంతంగా మారుతుంది. """/"/ ఇక రెండొవ‌ది.

జీడిప‌ప్పు, కుంకుమ పువ్వు, గ‌స‌గ‌సాలు పాల‌లో నాన‌బెట్టి.పావు గంట త‌ర్వాత పేస్ట్ చేసేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి పూత‌లా వేసుకుని.ప‌దిహేను లేదా ముప్పై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత కోల్డ్ వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారినికి ఒక‌టి లేదా రెండు సార్లు చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెర‌డంతో పాటు ఎలాంటి మ‌చ్చ‌లు, మొటిమ‌లు ఉన్న త‌గ్గుముఖం ప‌డ‌తాయి.

అలాగే పైన చెప్పుకున్న చిట్కాలు ఫాలో అవ్వ‌డంతో పాటు.రోజుకు ప‌ది జీడిప‌ప్పును తినాలి.

దీని ద్వారా శ‌రీరానికి అనేక పోష‌కాలు అంది.చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నా తమ్ముడు.. రాజమౌళి కామెంట్లకు ఫిదా అవ్వాల్సిందే!