క్యారెట్ ఫేషియ‌ల్..వారంలో ఒక్క‌సారి చేసుకుంటే మ‌స్తు బెనిఫిట్స్‌!

క్యారెట్ రుచిగా ఉండ‌ట‌మే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది.

అనేక జ‌బ్బుల‌నూ నివారిస్తుంది.చ‌ర్మ సౌంద‌ర్యానికి సైతం ఉప‌యోగ‌ప‌డుతుంది.

ముఖ్యంగా క్యారెట్‌తో వారానికి ఒకే ఒక్క సారి ఫేషియ‌ల్ చేసుకుంటే ఎన్నో స్కిన్ కేర్ బెనిఫిట్స్ పొందొచ్చు.

సాధార‌ణంగా అమ్మాయి అందంగా క‌నిపించేందుకు త‌ర‌చూ బ్యూటీ పార్ల‌ర్‌కు వెళ్లి చాలా ఖ‌ర్చు పెట్టి ఫేషియల్ చేయించుకుంటారు.

కానీ, క్యారెట్ ఫేషియ‌ల్ ఇంట్లోనే చాలా సుల‌భంగా ఎలాంటి ఖ‌ర్చు లేకుండా మ‌న‌కు మ‌న‌మే చేసుకోవ‌చ్చు.

మ‌రి ఆల‌స్య‌మెందుకు క్యారెట్ ఫేషియ‌ల్ ఎలా చేసుకోవాలి.? అస‌లు క్యారెట్ ఫేషియ‌ల్ వ‌ల్ల ఉప‌యోగాలు ఏంటీ.

? అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.h3 Class=subheader-styleస్టెప్‌-1:/h3p ముందు పీల్ తీసి శుభ్రం చేసుకున్న ఒక పెద్ద క్యారెట్ తీసుకుని మెత్త‌గా పేస్ట్ చేసేసుకోవాలి.

ముందు బౌల్ తీసుకుని అందులో రెండు స్పూన్ల క్యారెట్ పేస్ట్, ఒక స్పూన్ షుగ‌ర్‌, ఒక స్పూన్ ప‌చ్చి పాలు వేసుకుని మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసుకుని స్మూత్‌గా మూడు లేదా నాలుగు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి.

స్క్ర‌బ్బింగ్ అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.h3 Class=subheader-styleస్టెప్‌-2:/h3p మెత్త‌గా చేసుకున్న క్యారెట్ నుంచి జ్యూస్‌ను వేరు చేసుకోవాలి.

ఆపై ఒక బౌల్ తీసుకుని అందులో రెండ్లు స్పూన్ల క్యారెట్ జ్యూస్‌, ఒక స్పూన్ పాల మీగ‌డ వేసుకుని క‌లుపుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మానికి ముఖానికి రాసి క‌నీసం ప‌ది నిమిషాల పాటు సున్నితంగా మ‌సాజ్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి. """/"/ స్టెప్‌-3: ఒక బౌల్ తీసుకుని అందులో ఒక స్పూన్ ముల్తానీ మ‌ట్టి, ఒక స్పూన్ బియ్యం పిండి, ఒక స్పూన్ కాఫీ పౌడ‌ర్‌, ఒక స్పూన్ పెరుగు మ‌రియు స‌రిప‌డా క్యారెట్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మంతో ఫేస్‌కు ప్యాక్‌లా వేసుకుని.ఇర‌వై నిమిషాల త‌ర్వాత ఫేస్ వాష్ చేసుకోండి.

వారంలో కేవ‌లం ఒకే ఒక్క సారి పైన చెప్పిన విధంగా క్యారెట్ ఫేషియ‌ల్ చేసుకుంటే.

మీ స్కిన్ టోన్ పెరుగుతుంది.ట్యాన్ తొలిగిపోతుంది.

మొటిమ‌లు, న‌ల్ల‌టి మ‌చ్చ‌లు ఉన్నా త‌గ్గు ముఖం ప‌డ‌తాయి.ముఖ చ‌ర్మం ఎల్ల‌ప్పుడూ య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మెరిసి పోతుంది.

పైగా ముడ‌త‌ల స‌మ‌స్య ద‌రి చేర‌కుండా ఉంటుంది.

‘తలుపు వెయ్ బ్రదర్!’ ఓయో లవర్స్‌ ఘాటు రొమాన్స్‌.. వీడియో చూస్తే పగలబడి నవ్వుతారు..