నెయ్యితో ఆరోగ్యాన్నే కాదు అందాన్ని కూడా పెంచుకోండిలా!

పాల నుంచి తయారయ్యే ఉత్పత్తుల్లో నెయ్యి( Ghee ) ఒకటి.మన భారతీయ వంటల్లో నెయ్యికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దాని రుచి, సువాస‌న దాదాపు ప్ర‌తి ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంటుంది.అయితే నెయ్యి ఎంతో రుచికరంగా ఉండడమే కాదు బోలెడన్ని పోషకాలను కూడా కలిగి ఉంటుంది.

అందువ‌ల్ల‌ ఆరోగ్యపరంగా నెయ్యి అనేక ప్రయోజనాలను అందిస్తుంది.అంతేకాదండోయ్.

నెయ్యితో ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు.అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

చర్మాన్ని కాంతివంతంగా( Glowing Skin ) మృదువుగా మెరిపించే సత్తా నెయ్యికి ఉంది.

అందుకోసం ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టేబుల్ స్పూన్ శనగపిండి,( Besan Flour ) వన్ టేబుల్ స్పూన్ నెయ్యి, పావు టీ స్పూన్ పసుపు,( Turmeric ) రెండు టీ స్పూన్లు ప‌చ్చి పాలు వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని 15 నిమిషాల పాటు ఆర‌బెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో శుభ్రంగా వాష్ చేసుకోవాలి.

ఈ రెమెడీని పాటించడం వల్ల చర్మంపై మురికి, మృత కణాలు తొలగిపోతాయి.డ్రై నెస్ తగ్గుతుంది.

చర్మం మృదువుగా మరియు కాంతివంతంగా మారుతుంది. """/" / అలాగే కొందరు డార్క్ సర్కిల్స్ బాధపడుతుంటారు.

అలాంటి వారికి నెయ్యి ఎంతో అద్భుతంగా సహాయపడుతుంది.ప్రతిరోజు నైట్ నిద్రించే ముందు రెండు లేదా మూడు చుక్కలు నెయ్యి తీసుకుని కళ్ళ చుట్టూ అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.

ప్రతిరోజు ఈ విధంగా చేశారంటే డార్క్ సర్కిల్స్ క్రమంగా మాయం అవుతాయి. """/" / ప్రస్తుత చలికాలంలో పొడి గాలి కారణంగా చేతులు చాలా డ్రై గా మారిపోతూ ఉంటాయి.

మాయిశ్చరైజర్స్ వాడినప్పటికీ ఫలితం అంతంత మాత్రమే ఉంటుంది.అయితే వన్ టేబుల్ స్పూన్ నెయ్యి మరియు వన్ టేబుల్ స్పూన్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్ తీసుకుని రెండింటినీ మిక్స్ చేసి చేతులకు అప్లై చేసుకోవాలి.

ఈ విధంగా కనక చేస్తే డ్రై నెస్ తగ్గుతుంది.చేతులు మృదువుగా మరియు కోమలంగా మారతాయి.

పీరియడ్స్ లో నొప్పులు భరించలేకపోతున్నారా.. అయితే ఇలా చేయండి!