పారబోసే గంజిలో ఇవి క‌లిపి రాస్తే.. ముఖం మెరిసిపోవాల్సిందే!

సాధార‌ణంగా అన్నం వండేట‌ప్పుడు వార్చిన గంజిని పార‌బోసేస్తుంటారు.కానీ, పూర్వ కాలం మాత్రం గంజిని ఒక చుక్క కూడా పార‌బోయ‌కుండా కొద్దిగా ఉప్పు క‌లుపుకుని తాగేసేవారు.

దాంతో బియ్యంలో ఉండే అన్ని పోష‌కాలు వారి శ‌రీరానికి అందేవి.ఫ‌లితంగా ఆరోగ్యంగా ఉండేవారు.

కానీ, ప్ర‌స్తుత రోజుల్లో గంజిని సేవించ‌డానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు.అయితే పార‌బోసే గంజిని తాగ‌క‌పోయినా.

సౌంద‌ర్య ప‌రంగా ఎన్నో విధాలుగా ఉప‌యోగించుకోవ‌చ్చు.అవును, ముఖాన్ని అందంగా మెరిపించ‌డంలో గంజి అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి ఇంత‌కీ గంజిని చ‌ర్మానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా.

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గంజి మ‌రియు ప‌సుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.ఇర‌వై నుంచి ముప్పై నిమిషాల పాటు ఆరిపోనివ్వాలి.

అనంత‌రం గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మొటిమ‌లు మ‌రియు న‌ల్ల మ‌చ్చ‌లు త‌గ్గి.

చ‌ర్మం ప్ర‌కాశ‌వంతంగా మెరిసిపోతుంది. """/"/ రెండొవ‌ది.

ఒక బౌల్ తీసుకుని అందులో కొద్దిగా గంజి మ‌రియు రోజ్ వాట‌ర్ వేసి బాగా క‌లుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లే చేస్తూ.మూడు లేదా నాలుగు నిమిషాల పాటు మ‌సాజ్ చేసుకోవాలి.

అనంత‌రం చ‌ల్ల‌టి నీటితో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా వారానికి మూడు సార్లు చేయ‌డం వ‌ల్ల ముఖంపై మ‌లినాలు పోయి.

అందంగా మెరుస్తుంది.ఇక ముడతల త‌గ్గించ‌డంలోనూ గంజి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఒక బౌల్‌లో గంజి మ‌రియు లావెండర్‌ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి అప్లై చేసి.అర‌గంట పాటు వ‌దిలేయాలి.

ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.ఇలా త‌ర‌చూ చేయ‌డం వ‌ల్ల ముడ‌త‌లు క్ర‌మంగా త‌గ్గిపోయి.

ముఖం య‌వ్వ‌నంగా క‌నిపిస్తుంది.

వైరల్ వీడియో: పెళ్లయిన తరువాత మొదటిరోజు మీకు కూడా ఇలాగే జరిగిందా?