ఉల్లితో ఈ ప్రయోజనాలు కూడా ఉన్నాయా.. ఖచ్చితంగా తెలుసుకోండి!
TeluguStop.com
ప్రతి ఒక్కరి వంటింట్లోనూ ఖచ్చితంగా ఉండే పదార్థాల్లో ఉల్లిపాయ కూడా ఒకటి.ఉల్లి కోసేటప్పుడు కంట నీరుపెట్టిస్తుంది.
కానీ, ఇది ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తుంది.జీర్ణవ్యవస్థ మెరుగుపరచడంలో, గుండె ఆరోగ్యానికి మేలు చేయడంలో, చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తపోటును అదుపు చేడయంలో ఇలా చెప్పుకుంటూ పోతే ఉల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
అయితే ఆరోగ్యానికే కాదు.చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడంలో.
మరీ ముఖ్యంగా మొటిమలను తగ్గించడంలో ఉల్లి అద్భుతంగా సహాయపడుతుంది.మరి ఉల్లిని చర్మానికి ఎలా ఉపయోగించాలి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఉల్లి రసం తీసుకుని.అందులో దూదిని ముంచి మొటిమలు, మచ్చలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి.
పది నిమిషాల తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి. """/"/
ఇలా క్రమం తప్పకుండా చేస్తే.
మొటిమలు, మచ్చలు ఈజీగా తగ్గిపోతాయి.ఉల్లి రసం, తేనె కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి.
బాగా ఆరిన తర్వాత గోరువెచ్చిని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేయడం వల్ల ముఖం మృదువుగా, కాంతివంతంగా మెరిసిపోతుంది.
మరియు ముఖంలో ఉన్న జిడ్డును తొలగించి.ఫ్రెష్ లుక్ అందిస్తుంది.
ఉలిపాయ పేస్ట్‌లో కొద్దిగా పెరుగు మిక్స్.ముఖానికి పట్టించాలి.
అరగంట తర్వాత చల్లటి నీటితో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ సమస్యను సమర్థవంతంగా తగ్గిస్తుంది.
మరియు పొడిబారిన చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.కాబట్టి, తప్పకుండా ఈ టిప్స్ ట్రై చేయండి.
చంద్రబాబు హామీ : వంగవీటి రాధా దశ తిరగబోతోందా ?