చ‌ర్మ సౌంద‌ర్యానికి మామిడిపండు.. ఇలా వాడితే మ‌స్తు బెనిఫిట్స్‌

పండ్ల‌లో రారాజు అయిన మామిడి పండును చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ ఇష్ట‌ప‌డుతుంటారు.

మామిడి పండ్లు రుచిగా ఉండ‌ట‌మే కాదు.పోష‌కాలు కూడా మెండుగా ఉంటాయి.

విట‌మిన్ ఎ, విట‌మిన్ బి, విట‌మిన్ సి, విట‌మిన్ కె, మిన‌ర‌ల్స్‌, ప్రోటీన్స్‌, షుగ‌ర్స్ ఇలా అనేక పోష‌కాలు మామిడి పండులో ఉంటాయి.

అటువంటి మామిడి పండ్లు ఆరోగ్యానికి మాత్ర‌మే కాదు.చ‌ర్మ సౌంద‌ర్యానికి కూడా ఎన్నో ప్ర‌యోజ‌నాల‌ను చేకూరుస్తాయి.

మ‌రి మామిడి పండ్ల‌ను చ‌ర్మ సౌంద‌ర్యానికి ఎలా ఉప‌యోగించాలి అన్న‌ది ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా బాగా పండిన మామిడి పండు నుంచి గుజ్జు తీసుకుని.ఒక బౌల్‌లో వేసుకోవాలి.

ఇప్పుడు ఈ మామిడి పండు గుజ్జులో బాదం పేస్ట్‌, తేనె వేసి బాగా మిక్స్ చేసుకుని.

ముఖానికి పూత‌లా వేసుకోవాలి.ఇర‌వైపు నిమిషాల పాటు ముఖాన్ని ఆర‌నిచ్చి.

అనంత‌రం కోల్డ్ వాట‌ర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల చ‌ర్మ ఛాయ పెరుగుతుంది.

మ‌రియు కాంతివంతంగా కూడా మారుతుంది. """/" / అలాగే ఒక బౌల్‌లో మామిడి పండు గుజ్జు, ఓట్స్ పౌడ‌ర్ మ‌రియు ప‌చ్చి పాలు వేసి కలుపుకోవాలి.

ఆ త‌ర్వాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని.ప‌ది హేను లేదా ఇర‌వై నిమిషాల పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం వాట‌ర్‌తో ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకోవాలి.ఇలా చేయ‌డం వ‌ల్ల మొటిమ‌లు, ముడ‌త‌లు త‌గ్గుముఖం ప‌ట్టి.

చ‌ర్మం య‌వ్వ‌నంగా మారుతుంది.ఇక మామిడి పండు గుజ్జులో ముల్తాని మ‌ట్టి, పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకుని ఫేస్ ప్యాక్ వేసుకోవాలి.

అర గంట పాటు ముఖాన్ని ఆర‌నిచ్చి.ఆ త‌ర్వాత గోరు వెచ్చ‌ని నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి.

ఇలా వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు చేస్తే.డార్క్ స్పాట్స్ త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో పాటు ముఖంలో గ్లో కూడా పెరుగుతుంది.

బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్ కు సీపీఎం మద్ధతు.. సీఎం రేవంత్