ఆల్మండ్ ఆయిల్లో ఇవి కలిపి రాస్తే.. మెరిసే చర్మం మీసొంతం?
TeluguStop.com
ఆల్మండ్ ఆయిల్ లేదా బాదం నూనె దీని గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు.
బాదం పప్పు నుండి తయారు చేసే ఈ ఆల్మండ్ ఆయిల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ ఇ, విటమిన్ డితో పాటుగా పలు రకరకాల మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా అనేక పోషకాలు నిండి ఉన్నాయి.
అటువంటి ఆల్మండ్ ఆయిల్ సౌందర్య పరంగా ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది.కానీ, చాలా మందికి ఆల్మండ్ ఆయిల్‌ను ఎలా ఉపయోగించాలి అన్నది తెలియదు.
అయితే సరైన విధానంలో ఆల్మండ్ ఆయిల్‌ను యూజ్ చేస్తే ఎలాంటి చర్మ సమస్యలు దరి చేరకుండా ఉండటమే కాదు ముఖం అందంగా కూడా మెరుస్తుంది.
ఆల్మండ్ ఆయిల్ మరియు పాలు ఈ కాంబినేషన్ ముడతలు, చారలను పోగొట్టి చర్మాన్ని మృదువుగా మార్చడంలో గ్రేట్‌గా సహాయపడుతుంది.
ఒక స్పూన్ ఆల్మండ్ ఆయిల్లో ఒక స్పూన్ పాలు మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేసి బాగా ఆరనివ్వాలి.
అనంతరం కొద్దిగా నీళ్లు జల్లుకుని రుద్దుతూ ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి.
ఇలా రెండు రోజులకు ఒకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది. """/" /
అలాగే ఒక బౌల్లో కొద్దిగా ఆల్మండ్ ఆయిల్ మరియు గ్రీన్ టీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి సర్కిలర్ మోషన్లో కాసేపు మసాజ్ చేసుకోవాలి.
ఇక ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే డార్క్ స్పాట్స్, పింపుల్స్ వంటివి దూరం అవుతాయి.
ఇక ఆల్మండ్ ఆయిల్లో కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసి కలిపి ముఖానికి అప్లై చేసి స్క్రబ్ చేయాలి.
మూడు నుంచి ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసి కాసేపు ఆరనివ్వాలి.
అనంతరం ముఖాన్ని కోల్డ్ వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి.ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మృతకణాలు, మురికి పోయి ముఖం ఫ్రెష్ అండ్ క్లీన్‌గా కనిపిస్తుంది.
స్కిన్ వైట్నింగ్ కు బెస్ట్ క్రీమ్ ఇది.. ఇంట్లోనే తయారు చేసుకోండిలా!