మహాశివుడికి నచ్చిన మారేడు పండు ఎన్ని జబ్బులను దూరం చేస్తుందో తెలుసా?
TeluguStop.com
మారేడు పండు.దీనినే బిల్వ పండు అని కూడా పిలుస్తుంటారు.
మారేడు చెట్టు నుంచి వచ్చే మారేడు ఆకులు అన్నా, మారేడు పండు అన్నా ఆ మహాశివుడికి పరమ ప్రీతి అన్న సంగతి అందరికీ తెలుసు.
అందుకే పరమేశ్వరుడికి మారేడు ఆకులతో పూజ చేస్తే.పండును నైవేద్యంగా పెడుతుంటారు.
అయితే ముఖ్యంగా మారేడు పండులో ప్రోటీన్స్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ ఎ, విటమిన్ సి, ఫైబర్ ఇలా ఎన్నో పోషకాలు నిండి ఉన్నాయి.
అటువంటి మారేడు పండు మన ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు.అనేక జబ్బులను కూడా నివారిస్తాయి.
మరి మారేడు పండు యోక్క ఆరోగ్య ప్రయోజనాలు ఏంటీ అన్నది ఆలస్యం చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.
మంచి సువాసన, రుచి కలిగి ఉండే మారేడు పండు గుజ్జును తరచూ తీసుకోవడం వల్ల కడుపులో అల్సర్ సమస్య దూరం అవుతుంది.
నులి పురుగులు కూడా నాశనం అవుతాయి. """/"/
అలాగే ఈ వేసవి కాలంలో వాతావరణమే కాదు.
శరీర ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉంటాయి.అయితే మారేడు పండు గుజ్జుతో తయారు చేసిన రసం తీసుకుంటే శరీర వేడి దూరం అవుతుంది.
వేసవి తాపాన్ని కూడా తగ్గించేస్తుంది.మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు తరచూ మారేడు పండు తీసుకోవాలి.
ఇలా చేస్తే అందులో ఉండే ఫైబర్ మాలబద్ధకం సమస్యను దూరం చేయడంతో పాటు ఇతర జీర్ణ సమస్యలను కూడా తగ్గేలా చేస్తుంది.
ఇక మధుమేహం ఉన్న వారు ప్రతి రోజు మారేడు పండు గుజ్జు తీసుకుంటే.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.అంతేకాదు.
ఒత్తిడి, తలనొప్పి వంటి సమస్యలు ఉన్న వారు.మారేడు పండుతో తయారు చేసిన రసం తీసుకుంటే క్షణాల్లో రిలాక్స్ అవుతారు.
ఇక రక్త పోటును కూడా మారేడు పండు అదుపులో ఉంచుతుంది.
అమెరికా కస్టడీలో అన్మోల్ బిష్ణోయ్.. భారత్‌కు రప్పించాలని కేంద్రం యత్నాలు