వ్యాక్సిన్ వేసుకుంటే 5 వేలు.. చేయాల్సింది ఏంటంటే..!

కరోనా నియంత్రణలో భాగంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం చేస్తున్నారు.ప్రస్తుతం 45 ఏళ్లు పై బడిన వారికే ఈ వ్యాక్సిన్ వేస్తున్నారు.

ఫస్ట్ డోస్ పూర్తి చేసుకున్న వారికి సెకండ్ డోస్ కొనసాగిస్తున్నారు.ఇక 18 ఏళ్లు పైన వయసు గల వారికి వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతుంది.

ఈ వ్యాక్సిన్ ప్రోగ్రాం ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

వైరస్ వ్యాప్తి చెందకుండా సురక్షితంగా ఉండేలా వ్యాక్సిన్ వేయడమే కాకుండా వ్యాక్సిన్ వేసుకున్న వారికి 5 వేల రూపాయలు కూడా గెలుచుకునే అవకాశాన్ని ఏర్పాటు చేసింది.

అదెలా అంటే ఏముంది మనం కూడా సెలబ్రిటీల్లా వ్యాక్సిన్ వేసుకుని ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలి.

వ్యాక్సిన్ వేసుకున్న వారు ప్రభుత్వం తెలిపిన వెబ్ సైట్ లో ఫోటోని షేర్ చేయాలి.

ఆ ఫోటోతో పాటుగా వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించి ఏదైనా కొటేషన్ రాయాల్సి ఉంటుంది.

ఆ ట్యాగ్స్ వ్యాక్సిన్ ప్రయోజనాల గురించి తెలిసేలా ఉంటే బెటర్.అయితే ఇలా వచ్చిన ఫోటోలలో నెలకు 10 మందిని సెలెక్ట్ చేసి ప్రభుత్వం ఎంపిక చేసి వారికి ఐదు వేల రూపాయలు అందిస్తుందని తెలుస్తుంది.

అయితే దీనికోసం MyGov!--in పోర్టల్ ఓపెన్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి.మీ వివరాలన్ని ఇచ్చాక వ్యాక్సిన్ వేసుకున్నప్పటి ఫోటోని జత చేసి పంపితే సరిపోతుంది.

ఏపీ క్యాబినెట్ విస్తరణ.. వీరిని తప్పిస్తున్నారా ?