నేడే దాయాదుల పోరు.. తప్పక గెలవాల్సిందే.. లేకపోతే ఇంటికే

పాకిస్తాన్, భారత్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే చాలు.ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు మ్యాచ్ లైవ్ లో చూసేందుకు తెగ ఎదురు చూస్తుంటారు.

పురుషుల మ్యాచ్ మాత్రమే కాకుండా ఉమెన్స్ మ్యాచ్ కూడా ఈ మధ్య మరింత క్రేజ్ పెరిగింది.

ఇకపోతే ప్రస్తుతం జరుగుతున్న టి20 ప్రపంచ కప్ లో( T20 World Cup ) భాగంగా టీమ్ ఇండియా( Team India ) జట్టు మొదటి మ్యాచ్లో న్యూజిలాండ్ మహిళా జట్టుతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

దీంతో టోర్నీలో నిలబడాలంటే కచ్చితంగా నేడు జరుగుతున్న పాకిస్తాన్( Pakistan ) మ్యాచ్లో గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

"""/" / ఐసీసీ ఉమెన్స్ టి20 ప్రపంచ కప్ 2024 టోర్నీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్( Ind Vs Pak ) జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.

ఈ టోర్నీలో ఇప్పటికే రెండు జట్లు ఒక్కొక్క మ్యాచ్ ఆడాయి.మొదటి మ్యాచ్లో టీమిండియా న్యూజిలాండ్ చేతిలో భారీ తేడాతో ఓడిపోగా.

, మరోవైపు పాకిస్తాన్ జట్టు మాత్రం శ్రీలంక జట్టుపై 31 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది.

దీంతో పాకిస్తాన్ ఉత్సాహంగా భారత్ పై గెలిచేందుకు రెడీ అయింది.ఇక టీమిండియా మహిళల జట్టు పరిస్థితి ఇందుకు విరుద్ధంగా ఉంది.

"""/" / మొదటి మ్యాచ్లో బౌలింగ్ సమయంలో ధారాళంగా పరుగులు సమర్పించుకొని, మరోవైపు బ్యాటింగ్ సమయంలో వరుసగా టాప్ బ్యాటర్లు ఒక్కొక్కరుగా వెనుతిరగడంతో ఆలోచనలో పడిపోయింది టీమిండియా.

ఇక మహిళా టి20 ప్రపంచ కప్ లో భాగంగా నేటి మధ్యాహ్నం మూడున్నర గంటలకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పాకిస్తాన్, భారత్ ల మధ్య మ్యాచ్ మొదలకానుంది.

ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ లో వీక్షించవచ్చు.అలాగే హాట్ స్టార్ యాప్ ద్వారా కూడా మ్యాచ్ ను ప్రత్యక్ష ప్రసారంగా చూడవచ్చు.

ఆ బ్లాక్ బస్టర్ మూవీ డైలాగ్ వల్ల ఓయో హోటల్స్ స్టార్ట్ అయ్యాయా.. ఈ షాకింగ్ విషయం తెలుసా?