నలగొండ జిల్లా:గుర్రం పొడ్ మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ) ప్రకటించిన మహాలక్ష్మి పథకంపై చర్చ జరుగుతుంది.
తుక్కుగూడ సభలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలలో సోనియా గాంధీ ప్రకటించిన మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు నెలకి రూ.
2500,రూ.500లకే గ్యాస్ సిలిండర్,బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి అంశాలు మహిళలను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
నలుగురు మహిళలు ఎక్కడా కలిసినా వీటి గురించే చర్చించుకోవడం కనిపిస్తుంది.చేలల్లో, చెలకల్లో వీటి గురించి మాట్లాడుకుంటూ ఈ సారి కాంగ్రెస్ కే ఓటు వేద్దామనే మాటలు మహిళల నుండి విన్పిస్తున్నాయి.
మహిళా సంఘాల సభ్యులు సైతం కాంగ్రెస్ గ్యారంటీల గురించి మాట్లాడుకోవడం చూస్తుంటే గంపగుత్తగా మహిళల ఓట్లు హస్తం పార్టీ కొల్లగొట్టే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – మార్చి16, ఆదివారం 2025