హైదరాబాద్ హస్తినాపురంలో మహిళల ఆందోళన
TeluguStop.com
హైదరాబాద్ లోని హస్తినాపురంలో మహిళలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.రాత్రికి రాత్రే వైన్ షాప్ ఏర్పాటు చేయడంపై కాలనీవాసులు తీవ్రంగా మండిపడుతున్నారు.
"""/" /
అయితే శ్రీ రమణ కాలనీలో రాత్రికి రాత్రే వైన్ షాపు ఏర్పాటైంది.
ఓ వైపు బడి, మరోవైపు దేవాలయం ఉన్న ప్రాంతంలో మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఆలయానికి వంద మీటర్ల దూరంలో వైన్ షాపు ఉండాలన్న నిబంధనలను సైతం పట్టించుకోకుండా షాపు ఏర్పాటు చేయడం ఏంటని ప్రశ్నించారు.
అలాగే ఇలా మద్యం షాపు ఉంటే మహిళలకు, చిన్నారులకు భద్రత ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ క్రమంలోనే వైన్ షాపును వెంటనే తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు.
గుడ్ న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్! ఆనందంలో కుటుంబం