నన్ను పెళ్లి చేసుకో అంటూ వేధించిన స్నేహితుడు.. చివరికి?
TeluguStop.com
ప్రస్తుతం ఈ సమాజంలో చంపించడం, చావడం వంటి నేరాలు సులభంగా చేసేస్తున్నారు.తమకున్న సమస్యలను తట్టుకోలేక మనస్తాపంతో ఆత్మహత్య లకు పాల్పడుతున్నారు.
ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయి కాదన్నారని.తల్లిదండ్రులు, చదువు చెప్పే గురువులు బెదిరించారని.
పరువుకుసంబంధించిన సమస్యలు.ఇంకా మరిన్ని సమస్యలతో నేరాలు చేస్తూ, చేసుకుంటూ పోతున్నారు.
కాగా ఇటీవలే తనని పెళ్లి చేసుకోమని యువతిని బెదిరించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలరేపుతుంది.
సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కు చెందిన 23 ఏళ్ల యువతి.తను హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తుంది.
తనతో పాటు చదువుకున్న బొడ్డుపల్లి వంశీ తో స్నేహం చేసింది.అతడు తన స్నేహాన్ని ప్రేమగా భావించాడు.
దీంతో ఆ యువతి అతని ప్రవర్తన చూసి, తనతో నడుచుకుంటున్న విధానమును చూసి ముందుగానే తెలుసుకొని నాలుగు నెలలు అతనితో మాట్లాడకుండా దూరం పెట్టింది.
కాగా ఇటీవలే అదే మండలానికి చెందిన యువకుడితో నిశ్చితార్థం జరుగగా పెళ్లికి సిద్ధమయ్యింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న వంశీ ఆ యువతిని తనను పెళ్లి చేసుకోమని బెదిరించాడు.
లేదంటే తనతో సన్నిహితంగా దిగిన ఫోటోలను కాబోయే భర్తకు చూపిస్తానంటూ బెదిరించగా.ఆ యువతి తన మాటల్ని పట్టించుకోకుండా పెళ్ళికి సిద్ధం అయ్యింది.
దీంతో వంశీ ఆ ఫోటోలను పెళ్ళికొడుకు బంధువులలో ఒకరికి పంపగా జరగాల్సిన పెళ్లి ఆగిపోయింది.
అంతేకాకుండా ఆ ఫోటోలను తన స్నేహితులైన నూకల శ్రీకాంత్, నందికి శ్యామ్ రెడ్డిలకు పంపగా వాళ్లు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దీంతో ఆ యువతి తట్టుకోలేక మనస్థాపానికి గురై ఈ నెల 6న సూర్యాపేటలోని తన బంధువు ఇంటికి వెళ్ళింది.
తిరిగి 10 వ తేదీన తన సొంత గ్రామానికి వెళ్తానని చెప్పి బయలు దేరి 11 వ తేదీన ఇంటికి రాకపోయేసరికి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దీంతో 15 వ తేదీన మంగళవారం తమ గ్రామంలో తమ పొలం దగ్గర కుళ్లిపోయిన వాసన రావడంతో వెళ్లి చూసేవారికి ఆ యువతి శవమై కనిపించింది.
కన్న కూతురి మరణాన్ని చూసి తట్టుకోలేక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.తను నాలుగు రోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు.
తన మరణానికి కారణమైన బొడ్డుపల్లి వంశీ, నూకల శ్రీకాంత్, నందికి శ్యామ్ రెడ్డి లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మోకాళ్ళ నొప్పులను తరిమికొట్టే సూపర్ లడ్డూ ఇది.. రోజూ తింటే లాభాలే లాభాలు!