మహిళలు తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి:వైద్యాధికారిడాక్టర్ కోట చలం

సూర్యాపేట జిల్లా:ఆరోగ్య మహిళా కార్యక్రమం మహిళలకు వరమని మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని 57 రకాల పరీక్షలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేయించుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కోట చలం( Dr.

Kota Chalam ) కోరారు.మంగళవారం అనంతగిరి మండల పరిధిలోని త్రిపురారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆరోగ్య, ఆశా కార్యకర్తలు, మహిళలకు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరై ప్రత్యేక అవగాహన కల్పించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళా ఆరోగ్యంగా ఉంటేనే భవిష్యత్తు ఉంటుందన్నారు.8 రకాల విభాగాలలో ప్రత్యేకంగా మహిళల కోసమే ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

రక్తహీనతతో ( Anemia )బాధపడుతున్న మహిళలు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న ఉచిత ఐరన్ ఇంజక్షన్లను వేయించుకోవాలని సూచించారు.

సంతానం లేమి,పోషక లోపాలు, క్యాన్సర్ స్క్రీనింగ్( Cancer Screening ), డయాగ్నస్టిక్ సేవలు, ఇతర సమస్యలు,లైంగిక వ్యాధులు,శరీర బరువు నిర్వహణ తదితర అంశాలపై ప్రత్యేక వైద్యం అందిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమానికి హాజరయ్యే మహిళల వివరాలు ఎప్పటికప్పుడు నమోదయ్యే విధంగా చూడాలని సిబ్బందిని కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ నిరంజన్,వ్యాధి నిరోధక టీకాలు అధికారి డాక్టర్ పెండెం వెంకటరమణ,జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం త్రిపురవరం వైద్యురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న,డాక్టర్ రాగ మౌనిక,రత్నమేరీ,శైలజ మహేష్,సూపర్వైజర్ విజయ్ కుమార్, పి.

హెచ్.యన్ కళావతి, ఆరోగ్య కార్యకర్తలు శ్రీదేవి, శైలజ,మంజుల,రాధా, మహేశ్వరి,గీత,పద్మావతి, రమాదేవి,జ్యోతి మరియు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

బన్నీ, సుకుమార్ మధ్య గొడవలపై క్లారిటీ ఇచ్చిన ప్రొడ్యూసర్… అందుకే షూటింగ్ ఆగిందంటూ?