Rajanna Sircilla : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి జెడ్పీటీసీ కత్తెర పాక ఉమ -కొండయ్య

మహిళలు ఆర్థిక, రాజకీయ, సామాజిక పరంగా అన్ని రంగాల్లో సాధించాలని జడ్పిటిసి కత్తెరపాక ఉమా కొండయ్య( ZPTC Kattera Paka Uma ) పేర్కొన్నారు.

గురువారం బోయినిపల్లి మండలం విలాసాగర్ లోని మాజీ సర్పంచ్ ఇంట్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.అనంతరం జడ్పిటిసి మాట్లాడుతూ ఆకాశంలో సగం, అవకాశాల్లో సగం, అన్నింటా సగంగా ఉన్నప్పుడే మహిళలు సాధించినట్లు అవుతుందని మహిళల స్థితిగతులు బాగుపడందే సమాజం అభివృద్ధి చెందదని అన్నారు.

మహిళల పట్ల పురుషుల ఆలోచన ధోరణి మారాలని అన్నారు.ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారన్నారు.

ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా మహిళలు అన్ని రంగాల్లో అద్భుత విజయాలు సాధిస్తున్నారని ఉదాహరణకు విద్యా, వైద్యం, రాజకీయం, వ్యాపారం, అంతరిక్షం వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తు దిశగా అడుగులు వేస్తూ పురుష శక్తికి తాము ఏమి తీసుపోమని చెబుతుందన్నారు.

సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన సమాజ అభివృద్ధి కి మూలమని అన్నారు.

లింగ సమానత్వం కోసం ఆవిష్కరణ సాంకేతికలు, లింగ సమానత్వం వైపు పురోగతి సాధించి అన్ని రంగాల్లో మహిళలు సమాన అవకాశాలు సాధించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి అంజన్ రావు మహిళలు పాల్గొన్నారు.

బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కి హార్ట్ ఎటాక్.. వీడియో చూస్తే షాకే..