మహిళలు మౌనం వీడి ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయండి

ర్యాగింగ్, ఇవిటిజింగ్,లకు గురైతే వెంటనే జిల్లా షీటీమ్ వాట్సాప్ నెంబర్ 87126 56425 కాల్ చేయాలి మౌనం వీడితే మహిళా గెలిచినట్లే, మౌనంగా ఉండి కష్టాలు కోరి తెచ్చుకోవద్దు జిల్లాలో మహిళలకు,బాలికలకు భద్రత, భరోసా కల్పిస్తున్న షీ టీమ్.

జిల్లాలోని 58 హాట్స్పాట్ వద్ద షీటీమ్స్ తో నిరంతరం నిఘా ఈ సంవత్సరం విద్యార్థులను వేధిస్తున్న 108 మంది ఈవెటీజర్స్ మందిని పట్టుకొని కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగింది ఈ సంవత్సరం మహిళలను వేధిస్తున్న వారిపై 44 కేసులు,60ఈ పెట్టి కేసులు నమోదు చేయడం జరిగింది షీ టీమ్స్ మహిళలు పని చేసే ప్రదేశాలలో, విద్యాసంస్థల వద్ద 410 అవగాహన కల్పించడం జరిగింది జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న షీ టీమ్స్ బృందం విద్యాసంస్థలల్లో విద్యార్థిని విద్యార్థులకు ర్యాగింగ్/ ఇవిటీజింగ్/ పోక్సో/ షీ టీమ్స్/ యాంటీ హ్యుమెన్ ట్రాఫికింగ్ సైబర్ నేరాలపై నూతన చట్టాలపై 410 అవగాహన కల్పించడం జరుగుతుందని,ఈ సంవత్సర కాలంలో మహిళలను, విద్యార్థినులను, వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకొని 44 కేసులు నమోదు చేయడం జరిగిందని,60 మందిపై పెట్టి కేసులు నమోదు చేసి 110 మంది ఆకతాయిలకు తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి మహిళలకు,బాలికలకు భద్రత, భరోసా కల్పించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నూతన చట్టాలలో నేరస్తులకు కఠిన శిక్షలు అమలు చేయడం జరుగుతుంది.

మహిళలు బాలికల రక్షణ గురించి జిల్లాలో ఏర్పాటు చేసిన షీటీమ్స్ ఏదైనా ఫోన్ వస్తే తక్షణమే స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని ఆకతాయిలను అదులోకి తీసుకొని బాలబాలికల, విద్యార్థిని,విద్యార్థులకు రక్షణగా నిలుస్తూ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు.

జిల్లాలో గుర్తించిన హాట్స్పాట్ వద్ద నిఘా ఉంచడం జరుగుతుంది.మహిళలు బాలికలు విద్యార్థినిలు షీటీమ్స్ సేవలు వినియోగించుకోవాలని,ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తామని తెలిపారు.

విద్యాసంస్థలల్లోఎవరైనా వేధించిన,రోడ్డుపై వెళ్లేటప్పుడు,పని చేసే ప్రదేశాల్లో అవహేలనగా మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే 100, జిల్లా షీ టీమ్ నెంబర్ 8712656425 కు పిర్యాదు చేసినచో వారి మీద చట్టపరమైన చర్యాలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు.

జిల్లాలో పాఠశాల,కలశాల వద్ద ఆకతాయిలు బైక్ లపై ట్రిబుల్ రైడింగ్, ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ విద్యార్థినులకు ఇబ్బందులు గురి చేస్తున్నారని వచ్చిన పిర్యాదుల మేరకు సిరిసిల్ల , వేములవాడ పట్టణాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 30 మంది ఆకతయాలను అదుపులోకి తీసుకొని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందని ఎస్పీ తెలిపారు.

లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!