వైసీపీలో క‌లిసి రాని మ‌హిళా రాజ‌కీయం..!

కీల‌క‌మైన గుంటూరు జిల్లాలో వైసీపీ నేత‌ల మ‌ధ్య స‌ఖ్య‌త, వ్యూహం అనే మాట‌లే క‌నిపించ‌డం లేదని అంటున్నారు ప‌రిశీల‌కులు.

బ‌హుశ ఏ జిల్లాలోనూ లేని విధంగా వైసీపీ త‌ర‌ఫున ముగ్గురు మ‌హిళ‌లు ఎమ్మెల్యేలుగా విజ‌యం సాధించారు.

వీరిలో ఒక‌రు మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు.అయితే.

అనుకున్న రేంజ్‌లో ఈ ముగ్గురూ దూసుకుపోతోంది ఎక్క‌డా? అంటే.స‌మాధానం క‌నిపించ‌డం లేదు.

ప్రత్తిపాడు ఎమ్మెల్యే క‌మ్ మంత్రి మేక‌తోటి సుచ‌రిత‌కు స్థానికంగా ఉండే నేత‌లంటే.ప‌డ‌డం లేదు.

దీంతో ఆమె అంటీ ముట్ట‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.పైగా ఇటీవ‌ల కాలంలో పార్టీ నేత‌లు అమ‌రావ‌తిపై వివిధ సంద‌ర్భాల్లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసినా.

సుచ‌రిత మాత్రం ఎలాంటి కామెంట్లు చేయ‌డం లేదు.మౌనంగానే ఉంటున్నారు.

పోనీ.మిగిలిన మ‌హిళా నాయ‌కుల‌ను కూడా క‌లుపుకొని పోవ‌డం లేదు.

ఇక‌, చిల‌క‌లూరిపేట ఎమ్మెల్యే బీసీ సామాజిక వ‌ర్గానికి చెందిన విడ‌ద‌ల ర‌జ‌నీ.కూడా త‌న దారి త‌న‌దే అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఎవ‌రితోనూ క‌లివిడిగా ఉండడం లేదు.ఆమెకు సొంత పార్టీ ఎంపీ శ్రీకృష్ణ దేవ‌రాయుల‌తో పాటు జిల్లాలో కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌తో పొస‌గ‌డం లేదు.

మ‌రో ఎమ్మెల్యే డాక్ట‌ర్ ఉండ‌వ‌ల్లి శ్రీదేవి.వివాదాలకు ఇస్తున్న ప్రాధాన్యం త‌ప్ప‌.

అభివృద్దికి ఇస్తున్న ప్రాధాన్యం లేద‌నేది వైసీపీ నేత‌లే చెబుతున్న మాట‌.శ్రీదేవి రోజుకో వివాదంలో చిక్కుకుంటోన్న ప‌రిస్థితి ఉంది.

""img Src= దీంతో కీల‌క‌మైన గుంటూరులో ఇప్ప‌టి వ‌రకు ఏపార్టీ సాధించ‌ని విధంగా ముగ్గురు మ‌హిళా నేత‌ల‌ను గెలుచుకున్నా.

అటు పార్టీలో కానీ, ఇటు ప్ర‌జ‌ల‌కు కానీ మ‌రీ ముఖ్యంగా జిల్లాలోని మ‌హిళా వ‌ర్గానికి ఒరిగిన ప్ర‌యోజ‌నం ఏమీ క‌నిపించ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

జిల్లాలో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి.ముఖ్యంగా ఎస్సీ మ‌హిళ‌ల‌కు అనేక రూపాల్లో సాయం చేసేందుకు, బీసీ మ‌హిళ‌ల‌కు అనేక విధాలా అండ‌గా ఉండేందుకు ఈ ముగ్గురు మ‌హిళ‌లు ఇప్ప‌టికైనా క‌లిసి క‌ట్టుగా ప్ర‌య‌త్నాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

అప్పుడు పార్టీ పునాదులు మ‌రింత‌గా బ‌ల‌ప‌డే అవ‌కాశం ఉంటుంద‌ని, మ‌హిళా ఓటు బ్యాంకు పార్టీకి స్థిర‌ప‌డుతుంద‌ని అంటున్నారు.

మ‌రి ఇప్ప‌టికైనా ఉన్న స‌మ‌యాన్ని స‌ద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి.ఏదేమైనా.

మ‌హిళా నాయ‌కులు ఉన్నార‌నే పేరుంది త‌ప్పితే.వారివ‌ల్ల ఎవ‌రికి ప్ర‌యోజ‌నం? అనే మాటే వినిపిస్తోంది.

లావణ్య చేసిన పనికి విమర్శలపాలైన అత్తమ్మాస్ కిచెన్.. ఏం జరిగిందంటే?