పోలీస్ శాఖలో తాత, తండ్రి కంటే పెద్ద పోస్ట్ సాధించిన మహిళ.. ఈమె సక్సెస్ కు ఫిదా అవ్వాల్సిందే!

సాధారణంగా మహిళలలో చాలామంది పోలీస్ శాఖలో జాబ్ అంటే దూరంగా ఉంటారు.పోలీస్ శాఖలో జాబ్ ను ఎక్కువమంది రిస్క్ అని భావిస్తారు.

అయితే ఒక మహిళ మాత్రం పోలీస్ శాఖ( Police Department )లో తాత, తండ్రి కంటే పెద్ద పోస్ట్ సాధించి వార్తల్లో నిలిచారు.

ఆదాయపు పన్ను శాఖలో అప్పటికే చేస్తున్న ఉద్యోగాన్ని వదులుకుని మరీ ఈ మహిళ ప్రస్తుతం డీఎస్పీగా పని చేస్తుండటం గమనార్హం.

"""/" / లక్ష్యం గొప్పదై ఆ లక్ష్యం కోసం కష్టపడితే సక్సెస్ సొంతమవుతుందని ప్రియా సింగ్( Priya Singh ) ప్రూవ్ చేశారు.

యూపీలోని మానసరోవర్ కాలనీకి చెందిన ప్రియా సింగ్ ప్రస్తుతం కాన్పూర్ లో జాబ్ చేస్తున్నారు.

ప్రియా సింగ్ తాత పోలీస్ శాఖలో ఎస్.హెచ్.

ఓగా పని చేసి రిటైర్ కాగా తండ్రి మధురైలో ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్నారు.

తాత, తండ్రి ఉద్యోగాలను చూస్తూ పెరిగిన ప్రియా సింగ్ డీఎస్పీగా ఉద్యోగం సాధించి ఎంతోమందికి స్పూర్తిగా నిలిచారు.

"""/" / బాల్యం నుంచి చదువులో టాపర్ గా ఉన్న ప్రియా సింగ్ పీజీలో ఫిజిక్స్ చేసి యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు.

మొదటి ప్రయత్నంలో ఆదాయపు పన్ను శాఖలో ఉద్యోగం సాధించిన ప్రియా సింగ్ రెండో ప్రయత్నంలో డీఎస్పీ జాబ్ ( DSP Job )కు ఎంపిక కావడం గమనార్హం.

పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయంలో తాను తేలికగా ఉండే సబ్జెక్ట్ లపై దృష్టి పెట్టానని ఆమె చెప్పుకొచ్చారు.

పట్టుదల, తపన ఉంటే సక్సెస్ సొంతమవుతుందని ప్రియా సింగ్ కామెంట్లు చేశారు.కష్టపడితే సక్సెస్ సొంతం కావడంతో పాటు ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రియ సింగ్ కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

ప్రియా సింగ్ ను స్పూర్తిగా తీసుకుని తాము కూడా సక్సెస్ అవుతామని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

కలబందతో హెయిర్ గ్రోత్ సీరం ఎలా తయారు చేసుకోవాలో తెలుసా..?