ప్రేమ పేరుతో వంచనకు గురైన యువతి ఆత్మహత్య....

అనంతపురం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది.ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితాంతం తన వేలు పట్టుకుని నడవాలనుకున్న ఓ యువతి తన ప్రియుడి చేసినటువంటి మోసాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకుంది.

ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కుందుర్పి మండలం లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే స్థానిక ప్రాంతానికి చెందిన టువంటి కామాక్షి అనే యువతి అక్కడే ఉన్నటువంటి మానసిక వికలాంగుల స్కూలులో టీచర్ మరియు ఫిజియోథెరపీ గా పనిచేస్తోంది.

ఈ క్రమంలో ఇదే ప్రాంతంలో పంచాయతీ కార్యదర్శి గా పని చేస్తున్నటువంటి రాజేష్ అనే యువకుడితో ప్రేమలో పడింది.

అయితే ఇందులో భాగంగా ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హద్దులను కూడా దాటిపోయారు.అయితే కామాక్షి ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనే ప్రస్తావన తెచ్చినా సున్నితంగా తిరస్కరించేవాడు రాజేష్.

  అయితే తాజాగా కామాక్షి రాజేష్ ని పెళ్లి చేసుకుంటావా లేదా అని గట్టిగా నిలదీసింది.

"""/"/ దీంతో అతడు తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటూ తెగేసి చెప్పాడు.

దీంతో కామాక్షి తాను మోసపోయానని గ్రహించి సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది.

ఈ సూసైడ్ నోట్ లో తాను ఓ వ్యక్తి చేతిలో ప్రేమ పేరుతో మోసపోయాయని అలాగే తనకు బతికే ఆశ లేదని అందువలన చనిపోతున్నాను అని రాసి ఉంది.

అయితే సమాచారం అందుకున్న టువంటి పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అలాగే మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

అరె బుడ్డోడా.. అల్లు అర్జున్ ని మించి పోయావుగా.. వైరల్ వీడియో